ఎఫ్3 ప్రమోషన్లు మంచి స్వింగ్ మీదున్నాయి. కేవలం రెండు రోజులు మాత్రమే టైం ఉండటంతో హీరో వెంకటేష్ తో సహా టీమ్ మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తుతోంది. ఎవరు ఇంటర్వ్యూ అడిగినా నో చెప్పడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో మొదలుపెట్టి వెబ్, ప్రెస్, టీవీ దేన్నీ వదిలి పెట్టడం లేదు. ఇవి కాకుండా అనిల్ రావిపూడి స్పెషల్ గా డిజైన్ చేసిన కొన్ని ఎక్స్ క్లూజివ్ ప్రోగ్రాంస్ దీని కోసం సిద్ధం చేశారు. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ ఒక్కొక్కటిగా వీటిని బయటికి వదులుతారు. దానికి తగ్గట్టే బజ్ పెరుగుతోంది.
ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇతర హీరోల పాటలు సీన్లకు ఎఫ్3 టీమ్ ఇమిటేట్ చేయడం క్లిక్ అయ్యింది. అంతా బాగానే ఉంది కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇంత ఉత్సాహంగా అందరూ పాల్గొంటే తను ఎందుకు మిస్ అయ్యిందో అంతు చిక్కడం లేదు. భోళా శంకర్ షూటింగ్ జరగడం లేదు. చిరంజీవి విదేశాలకు వెళ్లడం వల్ల బ్రేక్ ఇచ్చారు. గుర్తుందా శీతాకాలం ఆల్రెడీ పూర్తయ్యింది. ఇవి కాకుండా తెలుగులో కొత్తగా కమిట్ మెంట్స్ లేవు
బాలీవుడ్లో ప్లాన్ ఏ ప్లాన్ బి, బోలె చుడీయా, బబ్లీ బౌన్సర్ లు ఫినిషయ్యే స్టేజిలో ఉన్నాయి. మరి తమన్నా ఎక్కడ బిజీగా ఉందో అంతు చిక్కడం లేదు. తన క్యారెక్టర్ ని కొంత తగ్గించి సోనాలి చౌహన్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అలక బూనిందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి కానీ ఇందులో ఎంత నిజముందో తను స్వయంగా చెబితే కానీ క్లారిటీ రాదు. సోనాలి పాత్రకు స్పేస్ ఇచ్చినట్టు కనిపిస్తోంది కానీ కేవలం ట్రైలర్ ని బట్టి ఒక నిర్ధారణకు రాలేం.. తను లేని లోటు ఫ్యాన్స్ కి స్ఫష్టంగా కనిపిస్తోంది. సరే పోనీ రిలీజయ్యాక సక్సెస్ మీట్ లో ఏమైనా దర్శనమిస్తుందో చూడాలి.
This post was last modified on May 24, 2022 6:16 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…