పాపం రాజశేఖర్.. కెరీర్ అసలే అంతంతమాత్రంగా ఉంటే.. ఆయన కొత్త సినిమా శేఖర్ కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఒకప్పుడు అంకుశం, అల్లరి ప్రియుడు లాంటి భారీ విజయాలతో టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్.. ఇప్పుడు తన సినిమాను ఆదరించి తన బతుకుదెరువును కాపాడాలని, ఈ సినిమా ఆడకుంటే తాను అప్పుల పాలైపోతానని ప్రేక్షకులను వేడుకున్నాడంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒక దశలో జీరో అయిపోయిన రాజశేఖర్ మార్కెట్‌ను మధ్యలో గరుడ వేగ సినిమా కాస్త పైకి లేపినట్లు అనిపించింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన కల్కికి మంచి క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలో విషయం లేకపోవడం, తర్వాత బాగా గ్యాప్ వచ్చేయడం, శేఖర్ సినిమాకు ఏ దశలోనూ బజ్ తీసుకురాలేకపోవడంతో రాజశేఖర్‌కు బాక్సాఫీస్ దగ్గర గడ్డు పరిస్థితులు తప్పలేదు.
ఈ రోజుల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం పెద్ద సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో ఏమాత్రం బజ్ లేకుండా శేఖర్ సినిమా రిలీజైంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆడే పరిస్థితి లేదు. అలాంటిది సినిమాకు టాక్ సరిగా లేదు. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. మినిమం ఆక్యుపెన్సీ కనిపించలేదు. రాజశేఖర్ అంతగా తన పరిస్థితి చెప్పుకున్నా, విన్నవించినా ఆయన అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో పెద్దగా స్పందన లేదు. ఇక టాక్ బాగా లేకపోయేసరికి సినిమా చల్లబడిపోయింది. శనివారం కూడా ఈ సినిమాకు ఆశించిన స్పందన లేదు.
దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు.. ఫైనాన్స్ గొడవల వల్ల ఆదివారం సాయంత్రం నుంచి సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నిజానికి సినిమాను కొనసాగించి ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. సోమవారం నుంచి థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి థియేట్రికల్ రన్ ఆగిపోయిందని బాధపడ్డానికేమీ లేదు. ఇప్పుడిక రాజశేఖర్ ఫ్యామిలీ చేయాల్సిందల్లా. ఈ వివాదాన్ని పరిష్కరించుకుని ఓటీటీ నుంచైనా చెప్పుకోదగ్గ డీల్ రాబట్టుకోవడమే.
This post was last modified on May 23, 2022 6:25 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…