తాము నటించిన సినిమా మీద హీరోలకు నటీనటులకు కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పు లేదు. కానీ దాని ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా చాలు సోషల్ మీడియా ట్రోలింగ్ తో నెటిజెన్లు ఆడేసుకుంటారు. ఆ మధ్య విశ్వక్ సేన్ పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి మాటలే చెప్పి అనవసరంగా ట్రిగ్గర్ అయ్యాడని అందరూ అనుకున్నారు కానీ అది నిజంగానే ఓపెనింగ్స్ కి ఉపయోగపడింది. కాకపోతే పాగల్ ఫ్లాప్ అయితే పేరు మార్చుకుంటానని చేసిన శపథం తర్వాత తూచ్ అనేశాడు. వసూళ్లు వచ్చాయి కదాని దాటేశాడు.
ఇదే తరహా స్టేజిపై మాటలు శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరు కుర్ర హీరోలు చేశారు. సరే వాళ్లంటే యూత్ బ్లడ్ కాబట్టి అనుకోవచ్చు. కానీ ఎఫ్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా కనక విజయం సాధించకపోతే ఇక మీ ముందుకు రానని అనేశారు. దీంతో అందరూ షాక్. చాలా నమ్మకం ఉంటేనే అలా అంటారు నిజమే. కానీ ఇలా ముందస్తుగా ఇలా చెప్పేసి రేపు ఏ మాత్రం అటుఇటు అయినా సరే అనవసరంగా మంచి పేరున్న రాజేంద్రుడు ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో టార్గెట్ అవుతారు.
మొత్తానికి ఎఫ్3 మీద టీమ్ వ్యక్తం చేస్తున్న నమ్మకం చూస్తుంటే హిట్టు కళ కనిపిస్తోంది. కాకపోతే బాక్సాఫీస్ ఫలితాలను ఎవరూ అంత ఈజీగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ఆర్ ని దేశవ్యాప్తంగా కెజిఎఫ్ 2 దాటడం అనూహ్యంగా జరిగింది. సర్కారు వారి పాటకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా 100 కోట్ల షేర్ దాటిందని నిర్మాతలే చెప్పుకుంటున్నారు. రాజమౌళి నెగటివ్ సెంటిమెంట్ ని ఆచార్య బ్రేక్ చేసే తీరుతుందని చిరంజీవి అన్న మాటలు తుస్సుమన్నాయి. మరి రాజేంద్రుడు అన్నవి ఏమవుతాయో చూడాలి.
This post was last modified on May 22, 2022 7:28 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…