ఆచార్య డిజాస్టర్ తాలూకు గాయం నుంచి మెగాభిమానులు బయట పడలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇండియా గర్వపడే సినిమా వచ్చాక ఇలాంటి ఫలితం దక్కడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అన్యాయంగా ఓటిటిలో కూడా ఎవరూ పట్టించుకోకపోవడం మరింత బాధ పెడుతోంది. టీవీలో ఓసారైనా చూడొచ్చని సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు పోస్టు పెడితే ఒట్టు. అందుకే చిరంజీవికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 రేంజ్ లో ఒక సూపర్ హిట్ అవసరం. ఈ కారణంగానే ఫ్యాన్స్ కళ్ళు గాడ్ ఫాదర్ మీద ఉన్నాయి.
మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ భాగం కూడా పూర్తి చేశారు. నయనతార తన పార్ట్ ని ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకుందట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే బాలన్స్ ఉన్న పనులన్నీ చకచకా కొలిక్కి తెస్తారు. ఆగస్ట్ 11 లేదా 12 విడుదల చేసే ఆలోచనను నిర్మాతలు సీరియస్ గా చేస్తున్నారని టాక్. లాల్ సింగ్ చద్దా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గం, యశోదలు ఉన్నప్పటికీ అవేవి కేర్ చేసే స్థితిలో లేరని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.
అదే నిజమైతే ఇంకో రెండున్నర నెలల్లోనే చిరు మరోసారి తెరపై చూడొచ్చు. అనంతపూర్ వేదికగా ఆగస్ట్ రెండో వారంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదనను చిరు ఆల్మోస్ట్ ఓకే చేశారని వినికిడి. మీడియాకు అఫీషియల్ గా ఎలాంటి బైట్స్ ఇవ్వకపోయినా జూలై నుంచి క్రమం తప్పకుండా ప్రమోషన్ చేసి ఆచార్యకు జరిగిన పబ్లిసిటీ పొరపాట్లు దీనికి రిపీట్ కాకుండా చూసుకుంటారట. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే అంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ప్రేక్షకుల నుంచి ఇంకేముంటుంది.
This post was last modified on May 22, 2022 7:04 am
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…