కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ వాళ్ల బాధలు మామూలుగా లేవు. గత రెండేళ్లలో దాదాపు ఏడాదిన్నర పాటు థియేటర్లు సరిగా నడవలేదు. అవకాశం దొరికనపుడు రిలీజ్ చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు. ఓవైపు సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్లో వసూళ్ల మోత మోగించేస్తుంటే.. హిందీ స్టార్ల సినిమాలు చతికిలపడటం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
హిందీ ప్రేక్షకుల అభిరుచి ఉన్నట్లుంది ఎందుకిలా మారిపోయిందో.. తమ సినిమాల్లో ఏం లోపం ఉందో.. ఎలాంటి సినిమాలు తీస్తే మళ్లీ తమ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమో తెలియక అయోమయానికి గురయ్యారు. ఇలాంటి టైంలో ఆశాదీపంలా వచ్చింది ఓ సినిమా. అదే.. భూల్ భూలయియా-2. ఓవైపు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి హీరోల స్టార్ ఇమేజ్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం పని చేయకపోగా.. కార్తీక్ ఆర్యన్ అనే ఇమేజ్ లేని యువ కథానాయకుడు తన సినిమాతో ఇప్పుడు మ్యాజిక్ చేస్తున్నాడు.
శుక్రవారం రిలీజైన ‘భూల్ భూలయియా-2’కు ముందు నుంచి మంచి బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఇక సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో తొలి రోజు రూ.14 కోట్ల దాకా నెట్ వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఓవైపు అజయ్ దేవగణ్ సినిమా ‘రన్ వే 34’ మంచి టాక్ తెచ్చుకుని కూడా తొలి రోజు మూడు కోట్ల నెట్ వసూళ్లకు పరిమితం అయితే.. కార్తీక్ ఆర్యన్ సినిమాకు దాని మీద నాలుగు రెట్లకు పైగా వసూళ్లు రావడం ఆశ్చర్యం. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కార్తీక్‌కే కట్టబెట్టలేం కానీ.. ప్రేక్షకుల్లో అతడి పట్ల పాజిటివ్ ఫీలింగ్, సానుభూతి ఉండటం సినిమాకు కలిసొచ్చిందన్నది వాస్తవం. సినిమాలో అతడి పెర్ఫామెన్స్ కూడా సూపరనే అంటున్నారంతా.
నిజానికి కొన్ని నెలల కిందట కార్తీక్ ఆర్యన్ గురించి బాలీవుడ్లో అందరూ నెగెటివ్‌గా మాట్లాడుకున్నారు. కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా క్యాన్సిల్ కావడంతో కార్తీక్ బాలీవుడ్ బడా బాబుల ఆగ్రహానికి గురయ్యాడని, అతడి కెరీర్ ముందుకు సాగడం కష్టమని మీడియాలో జోరుగా వార్తలు వచ్చేశాయి. కానీ అతణ్ని కరణ్ టార్గెట్ చేయడం జనాల్లో సానుభూతి పెంచినట్లుంది. సొంత టాలెంట్‌తో కష్టపడి ఎదిగిన అతడి మీద పాజిటివ్ ఫీలింగ్‌తో ఉన్న ఆడియన్స్ ఇప్పుడు అతడి సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు బాలీవుడ్ సేవియర్‌గా మారాడు కార్తీక్.
This post was last modified on May 21, 2022 9:16 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…