కొన్నిసార్లు ప్రేక్షకులు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల బయటి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుని సినిమాలకు ఫలితాలు కట్టబెడుతుంటారు. బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొస్తున్నపుడు మరీ అతి చేస్తే.. పరిస్థితులు ఎదురు తిరిగినపుడు బొక్క బోర్లా పడాల్సి వస్తుంది.
ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది. ఆమె కొత్త చిత్రం ‘ధాకడ్’కు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేట్లు లేదు. ఈ సినిమా గురించి కంగనా చెప్పుకున్న గొప్పలు అన్నీ ఇన్నీ కావు. హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమాల తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రంతో ఇండియాలో తనకు ‘సూపర్ ఉమన్’ తరహా ఇమేజ్ వచ్చేస్తుందని కంగనా భావించింది.
ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హెలికాఫ్టర్లలో తిరుగుతూ.. మీడియా ముందు తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చాలా అతే చేసింది కంగనా. ‘మణికర్ణిక’ టైంలో దర్శకుడు క్రిష్‌ను అవమానించి.. ఆ సినిమా క్రెడిట్ అంతా తనదే అన్నట్లు పోజులు కొట్టడం.. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల్లో శ్రుతి మించి మాట్లాడటం.. తమ పాటికి తాము ఉన్న బాలీవుడ్ సెలబ్రెటీలను కెలికి మరీ వాళ్లను కించపరిచేలా మాట్లాడ్డం.. ఇలా చాలానే చేసింది కంగనా.
ఐతే ఇవన్నీ దృష్టిలో ఉంచుకునో ఏమో.. ప్రేక్షకులు ఆమె సినిమాను అసలు పట్టించుకోవట్లేదు. తొలి రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ వసూల్లు రూ.50 లక్షలే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. కంగనాకు ఇంతకంటే పరాభవం ఇంకోటి లేనట్లే. ‘మణికర్ణిక’ సహా కొన్ని విజయాలతో తాను స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోనట్లుగా మాట్లాడేది కంగనా.
ఆ తలబిరుసుతోనే అనేక కాంట్రవర్శల్ కామెంట్లు చేసింది. కానీ ఇప్పుడు ఆమె సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇంత దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్లో సినిమా రూ.5 కోట్లు కూడా వసూలు చేసేలా లేదు. అందులోనూ ‘భూల్ భూలయియా-2’ లాంటి ఎంటర్టైనర్‌తో కంగనా సినిమా పోటీ పడింది. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక దాని ముందు కంగనా సినిమా నిలవడం చాలా కష్టమే.
This post was last modified on May 21, 2022 3:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…