Movie News

ఎన్టీఆర్.. మాస్ అమ్మా మాస్


టీనేజీలోనూ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా ఎదిగిన న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాల‌తో అత‌డికి వ‌చ్చిన మాస్ ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. కానీ త‌ర్వాత ఆ స్థాయి విజ‌యాలు ద‌క్క‌క అత‌ను కొంచెం వెనుక‌బ‌డ్డాడు. ఒక ద‌శ‌లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో అత‌డి కెరీర్ బాగా స్లో అయింది కూడా. కానీ టెంప‌ర్ ద‌గ్గ‌ర్నుంచి పుంజుకుని నిల‌క‌డ‌గా విజ‌యాలు అందుకుంటున్నాడు. మూడున్న‌రేళ్ల కింద‌ట అర‌వింద స‌మేత‌తో కెరీర్లో మంచి హిట్ కొట్టి.. తాజాగా ఆర్ఆర్ఆర్‌తో రికార్డు హిట్‌లో భాగం అయ్యాడు.

ఐతే తార‌క్ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్నా, సినిమా సినిమాకూ ఎదుగుతున్నా.. అభిమానుల్లో కొంత అసంతృప్తి లేక‌పోలేదు. అందుక్కార‌ణం.. తార‌క్ స్టామినాకు త‌గ్గ మాస్ సినిమా ప‌డ‌క‌పోవ‌డ‌మే. ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఆ మాస్‌నే అత‌ను మిస్ అయిపోతున్నాడ‌న్న‌ది వాళ్ల బాధ‌.

అర‌వింద స‌మేత‌లో కొంత వ‌ర‌కే మాస్ ఉంటుంది. మిగ‌తా అంతా క్లాస్‌గా సాగిపోతుంది. ఆర్ఆర్ఆర్ అంటే అది వేరే వ్య‌వ‌హారం. అందులో మాస్ కోణంలో చూస్తే తార‌క్‌కు రావాల్సినంత ఎలివేష‌న్ రాలేద‌న్న ఫీలింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలో తార‌క్ పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేయాల‌ని, త‌న స్టామినా మొత్తం తెర‌పై చూపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే ఇప్పుడు తార‌క్ స‌రిగ్గా అలాంటి సినిమాలే లైన్లో పెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన రెండు సినిమాల గ్లింప్స్ చూస్తే మాస్‌కు ఇవి పూన‌కాలు తెప్పించేలాగే క‌నిపిస్తున్నాయి. తార‌క్‌తో త‌న సినిమా పూర్తి స్థాయి మాస్‌గా ఉంటుంద‌ని కొర‌టాల ముందే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు టీజ‌ర్ చూశాక అత‌ను చెప్పిన‌దానికంటే మాస్‌గా క‌నిపించింది. ఇక ప్ర‌శాంత్ నీల్ సంగ‌తి అస‌లు చెప్పాల్సిన ప‌నే లేదు. ప్రి లుక్, దాని గురించి ఇచ్చిన డిస్క్రిప్ష‌న్ చూస్తే ఇది కూడా ఊర మాస్‌గా ఉంటుంద‌నే అనిపిస్తోంది. ఈ రెండు సినిమాల‌తో తార‌క్ మ‌రోసారి తిరుగులేని మాస్ హీరోగా అవ‌త‌రిస్తాడన్న‌ది అభిమానుల ఆకాంక్ష‌.

This post was last modified on May 21, 2022 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

3 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

4 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 hours ago