నిన్న ఓటిటి ఫ్యాన్స్ క్రేజీ కంటెంట్ తో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందానానలతో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉండగా ఇవి ఆల్రెడీ చూశాంగా ఇంకేమైనా కొత్తవి కావాలనుకునే వారికి బోలెడు ఆప్షన్స్ కళ్ళముందు నిలిచాయి. అందులో మొదటిది 12త్ మ్యాన్. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ ఉంటుందేమోనని ఎదురు చూసిన వాళ్లకు నిరాశ కలిగిస్తూ కేవలం మలయాళం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు.
దృశ్యం సృష్టికర్త, దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక టాక్ సంగతి చూస్తే హైప్ తగ్గట్టు మూవీ తమను ఎగ్జైట్ చేయలేకపోయిందని అధిక శాతం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. జీతూ మార్క్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ లెన్త్ మరీ రెండు గంటల నలభై నిముషాలు ఉండటం, ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ ఎస్టాబ్లిష్ మెంట్ కే ఎక్కువ సమయం తీసుకోవడం బోర్ గా ఫీలయ్యామని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ తీవ్ర అసంతృప్తి కాదు కానీ ఫైనల్ గా హ్యాపీ కాలేదని అంటున్నారు.
కథ విషయానికి వస్తే స్నేహితులంతా కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు. సరదాగా ఒక గేమ్ ఆడటం మొదలుపెడతారు. అనూహ్యంగా అందులో అమ్మాయి హత్యకు గురవుతుంది. దాంతో హంతకుడెవరో తెలుసుకునే క్రమంలో మోహన్ లాల్ వాళ్ళ మధ్యలోకి వస్తాడు. అసలింతకీ 12త్ మ్యాన్ అంటే ఎవరు, మర్డర్ ఎందుకు చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా. మోహన్ లాల్ మీద అభిమానముంటే చూసేయొచ్చు కానీ దృశ్యం కాంబో కదాని అంచనాలు ఎక్కువ పెట్టుకుంటేనే చిక్కు.
This post was last modified on May 21, 2022 6:55 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…