ఏదైనా పెద్ద హీరో సినిమా థియేట్రికల్ రన్ పూర్తవ్వగానే అక్కడితో రికార్డుల కథ ముగిసిపోదు. టీవీలో శాటిలైట్ ప్రీమియర్ జరిగాక వచ్చే టిఆర్పి రేటింగ్స్ మీద కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవలే స్టార్ మాలో టెలికాస్ట్ అయిన భీమ్లా నాయక్ బుల్లితెరపై కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా ఈ రివెంజ్ డ్రామా కేవలం 9.1 రేటింగ్ తో సరిపుచ్చుకుంది. ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోణంలో చూసుకుంటే తక్కువే అని చెప్పాలి.
దీనికి కారణం లేకపోలేదు. భీమ్లా నాయక్ ఓటిటిలో వచ్చి చాలా రోజులయ్యింది. మార్చిలోనే ఆహా, హాట్ స్టార్ రెండింటిలో స్ట్రీమింగ్ చేశారు. దాదాపుగా అందరికీ రీచ్ అయిపోయింది. నగరాలు పట్టణాల్లో ఈ యాప్స్ ఉన్న ప్రేక్షకులు చూసేశారు. చిన్న చిన్న ఊళ్లు గ్రామాల్లో లోకల్ కేబుల్ ఛానల్స్ డౌన్లోడ్ వెర్షన్ ని ప్రసారం చేశాయి. సో ప్రత్యేకంగా టీవీలో వచ్చినప్పుడు చూద్దామనే ఎగ్జైట్ మెంట్ బాగా తగ్గిపోయింది. దాని ప్రభావం వల్లే ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ నెంబర్ వచ్చిందని టిఆర్పి విశ్లేషకుల అంచనా.
పవన్ కెరీర్లోనే మెగా డిజాస్టర్ గా చెప్పుకునే సర్దార్ గబ్బర్ సింగ్ అప్పట్లో 14కి పైగా రేటింగ్ తెచ్చుకుంది. కానీ ఆ పరిస్థితులకు ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఓటిటిలు విపరీతంగా పెరిగిపోయాయి. 4జి వచ్చాక పైరసీ విశ్వరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వీలైనంత థియేటర్ కు శాటిలైట్ కు మధ్య గ్యాప్ తగ్గించాలి. అంతే తప్ప రెండు మూడు నెలల తరువాత వేస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయి. అన్నట్టు భీమ్లా నాయక్ కంటే అదే బ్యానర్ లో వచ్చిన చిన్న బడ్జెట్ మూవీ డిజె టిల్లుకి ఒక మార్కు ఎక్కువ రేటింగ్ రావడం ట్విస్ట్.
This post was last modified on May 19, 2022 3:01 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…