టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. పదేళ్లు కూడా వయసు లేనపుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వందల చిత్రాల్లో నటించాడతను. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అతడిది. ఇందులో 90వ దశకం నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు ఆలీ హవా బాగా నడిచింది. బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ లాంటి వాళ్ల హవాలోనూ తన సినిమాలు తనకుండేవి. కానీ గత దశాబ్ద కాలంలో ఆలీ జోరు బాగా తగ్గింది.
బ్రహ్మానందం అంతటివాడే ట్రెండుకు తగ్గట్లు కామెడీ చేయలేక, క్యారెక్టర్లు పండక సైడైపోయాడు. ఇక ఆలీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆలీ రాజకీయాల్లో అడుగు పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో చాలామందికి చెడుగా మారి.. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల మాట. కారణాలేవైనా సరే.. ఆలీ కెరీర్ అయితే ఆశాజనకంగా లేదు.
ఐతే వచ్చే వారం విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘ఎఫ్-3’లో ఆలీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో అతడి పాత్ర పేరు పాల బేబీ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆలీ.. కెరీర్ ఊపు తగ్గడంపై మాట్లాడాడు. “ఏ క్యారెక్టర్ పడితే అది చేయొద్దనే సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. వాళ్లు కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నపుడు ఆలీ ఎందుకు ఇలాంటి సినిమాలో నటించాడు అని జనాలు అనుకుంటున్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వదులుకున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నియమం పెట్టుకున్నాను. ఎఫ్-3లో మంచి పాత్ర దక్కింది. సినిమాలో నా పాత్ర 45 నిమిషాలు ఉంటుంది. వడ్డీకి డబ్బులు తిప్పే పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడన్నది తెరపైనే చూడాలి” అని ఆలీ చెప్పాడు.
ఇక వైకాపా తరఫున కష్టపడి ప్రచారం చేసినా ఏ పదవీ దక్కకపోవడంపై ఆలీ మాట్లాడుతూ.. “నన్ను రాజకీయ నాయకుడిని చేసింది జగన్ గారు. ఆయన నాకు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్ వస్తే వెళ్తా” అని చెప్పాడు.
This post was last modified on May 19, 2022 2:56 pm
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…