‘ఛలో’ సినిమాతో భారీ విజయాన్నదుకుని, తర్వాత వరుసగా సినిమాలు లైన్లో పెట్టి ఒక టైంలో మంచి రేంజికి వెళ్లేలా కనిపించాడు యువ కథానాయకుడు నాగశౌర్య. సొంత బేనర్లో చేసిన ‘అశ్వథ్థామ’ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా సరే.. దానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయారు అప్పట్లో. కానీ ఈ ఊపును నాగశౌర్య కొనసాగించలేకపోయాడు. ముందు వెనుక చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుపోతూ.. క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. దీంతో వచ్చిన క్రేజ్ మొత్తం కరిగిపోయింది.
అతడి చివరి సినిమా ‘లక్ష్య’ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. అంతకుముందు ‘వరుడు కావలెను’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ సొంత బేనర్లో చేసిన ‘కృష్ణ వ్రింద విహారి’ మీదే నాగశౌర్య ఆశలన్నీ నిలిచాయి. ‘అలా ఎలా’ ఫేమ్ అనిల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అందమైన ప్రోమోలతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది.
ఐతే ఈ సినిమా విడుదల విషయంలో విపరీతమైన సందిగ్ధత నడుస్తోంది. సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధమైన రిలీజ్ టైమింగ్ కుదరట్లేదు. ఒక రిలీజ్ డేట్ ఇవ్వడం.. ఆ డేట్ దగ్గరికొచ్చేసరికి సైలెంటైపోవడం.. ఇదీ వరస. విడుదల తేదీని ప్రకటించేటపుడు ఉత్సాహం ప్రకటించి.. వాయిదా టైంలో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇలా ఉంటే ప్రేక్షకుల్లో సినిమా మీద ఏం ఆసక్తి ఉంటుంది? ఈ చిత్రాన్ని ఎలా సీరియస్‌గా తీసుకుంటారు.
ఏప్రిల్ 21, మే 6, మే 20.. ఇలా ఇప్పటికే మూడు డేట్లు మారాయి. ఈ నెల 20కి సినిమాను షెడ్యూల్ చేశారు. కానీ ప్రమోషన్లు చేయలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పుడు చప్పుడు లేదు. నిజానికి గత వారం వచ్చిన ‘సర్కారు వారి పాట’ వీకెండ్ తర్వాత చల్లబడిపోయింది. ఈ వారానికి రాజశేఖర్ ‘శేఖర్’ మినహా చెప్పుకోదగ్గ సినిమా లేదు. దానికి బజ్ కూడా అంతగా లేదు. నాగశౌర్య సినిమాను రిలీజ్ చేయడానికి మంచి అవకాశమే ఉంది. తర్వాతి వారం నుంచి వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. జూన్ అంతా ప్యాక్ అయిపోయింది. మరి తన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేద్దామన్నది నాగశౌర్య ప్లానో?
This post was last modified on May 18, 2022 4:55 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…