కొన్ని సంగతులు కాకతాళీయంగా జరిగినా వాటి వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఈ నెల 26న టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావెరిక్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. హైదరాబాద్ లాంటి కీలక నగరాల్లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. ఇది 1986లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టాప్ గన్ కి కొనసాగింపు. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత టామ్ క్రూజే ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. ఒరిజినల్ ని మించిన యాక్షన్ ని ఇందులో దట్టించారు.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ జూన్ 3న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ ల కాంబోతో పాటు సూర్య స్పెషల్ క్యామియో చేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఇదే టైటిల్ తో 1986లో కమల్ ఓ స్పై మూవీ చేశారు. ఆ ఏడాదిలో పెద్ద హిట్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఇళయరాజా సంగీతం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. కట్ చేస్తే అంతే గ్యాప్ తో అదే పేరుతో కమలే నటించిన విక్రమ్ 2022లో రాబోతోంది.
ఆయా పరిశ్రమల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఇద్దరు హీరోలు ఇలా మూడు దశాబ్దాల తర్వాత టైటిల్స్ రిపీట్ చేయడం విశేషమేగా. దీని గురించే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా చర్చించుకుంటున్నారు. అదే మేజిక్ టామ్, కమల్ ఇద్దరికీ రిపీట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. రెండింటి మధ్య గ్యాప్ కేవలం వారం రోజులే ఉండటం గమనార్హం. ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బద్దలు కావడం ఖాయమని బజ్ ని చూస్తే అర్థమవుతోంది. మరి టాప్ గన్, విక్రమ్ లు ఏం చేయబోతున్నాయో చూడాలి
This post was last modified on May 18, 2022 1:57 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…