డాక్టర్ ఆశలన్నీ శేఖర్ మీదే

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న శేఖర్ మీద డాక్టర్ రాజశేఖర్ కు గట్టి నమ్మకమే ఉంది. నిజజీవిత భాగస్వామి జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళం హిట్ మూవీ జోసెఫ్ కు అఫీషియల్ రీమేక్. ముందు ఒకరిద్దరు దర్శకులను అనుకుని కొంత భాగం అయ్యాక ఏవో కారణాల వల్ల జీవిత మెగా ఫోన్ తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. ఫిబ్రవరి నుంచి దీని వాయిదాల పర్వం మొదలై ఆఖరికి మే 20కి లాక్ చేసుకుంది. వాస్తవానికి పోటీ పరంగా చూసుకుంటే తెలుగులో ఇది మంచి డేటే.

అలా అని సంబరపడేందుకు లేదు. ఎందుకంటే రాజశేఖర్ మార్కెట్ చాలా కాలం క్రితమే డౌన్ అయ్యింది. గరుడవేగా బాగానే ఆడినా ప్రొడక్షన్ కాస్ట్ వల్ల పెద్ద హిట్ అనిపించుకోలేదు. తన రేంజ్ కి మించి ఖర్చు పెట్టిన కల్కి నిరాశపరిచింది. ఇలాంటి టఫ్ సిచువేషన్ లో శేఖర్ రావడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది.పూర్తిగా మౌత్ టాక్ మీద ఆధారపడిన ఈ మెడికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో రాజశేఖర్ తో పాటు ఆయన కూతురు శివాని కూడా చిన్న క్యారెక్టర్ ఒకటి చేయడం విశేషం. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

శేఖర్ రిలీజవుతున్న రోజు తెలుగులో సంపూర్ణేష్ బాబు దగడ్ సాంబ ఒకటే రేస్ లో ఉంది. ఇదేమి కాంపిటీషన్ కాదు. హిందీ నుంచి భూల్ భులయ్య 2, కంగనా రౌనత్ దాకడ్ లు వస్తున్నాయి. సర్కారు వారి పాట టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే ఉంది. కంటెంట్ అటుఇటు ఉన్నా మహేష్ ఇమేజ్ శ్రీరామరక్షలా నిలుస్తోంది. రెండో వారంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎఫ్3 వచ్చే దాకా ఇదే ఓన్లీ ఛాయస్ గా నిలుస్తోంది. మరి శేఖర్ సోలో రావడాన్ని అడ్వాటేంజ్ గా తీసుకుంటాడో లేదో ఇంకో మూడు రోజుల్లో తేలనుంది.