Categories: Movie News

రంగమార్తాండ రూటు ఎటువైపు

ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ మూవీస్ తోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టిన కృష్ణవంశీ చాలా కాలం నుంచి తన స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయారు. చేతికొచ్చిన బంగారంలాంటి అవకాశం గోవిందుడు అందరి వాడేలేతో వృధా చేసుకున్నారు. బిల్డప్ గట్టిగా కనిపించిన నక్షత్రం కొన్నవాళ్ళకు నక్షత్రాలను చూపించింది. వీటి ముందు కూడా మొగుడు, శశిరేఖా పరిణయం లాంటి ఫ్లాపులు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా టైం బ్యాడ్, ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ లోకి రాకపోరాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు

ఇప్పుడు నిర్మాణంలో ఉన్న రంగమార్తాండ మీద ఆయనకే కాదు ఫ్యాన్స్ కు సైతం చాలా ఆశలున్నాయి. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్ర పోషించగా రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అంతఃపురం తర్వాత ఇళయరాజా సంగీతం అందిస్తున్న కృష్ణవంశి మూవీ ఇదే. సో మ్యూజికల్ గానూ దీని మీద స్పెషల్ కార్నర్ ఉంది. అయితే రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ బడ్జెట్ సినిమా విడుదల అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఖచ్చితంగా చెప్పడం లేదు. 

మరాఠిలో నానా పాటేకర్ నటసామ్రాట్ రీమేక్ గా రూపొందిన రంగమార్తాండకు కొన్ని ఓటిటి సంస్థలు 20 కోట్ల దాకా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఎలా చూసుకున్నా క్యాస్టింగ్ కి, ప్రొడక్షన్ కు పెట్టిన ఖర్చుకి అంత మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. అసలు బజ్ లేని ఈ సినిమాకు హైప్ తేవడం కోసమే లీకులు ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. పోనీ థియేటర్లలో వదులుతారా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఎంత కళాత్మకంగా తీసినా ఇలాంటి వాటిని హాలు దాకా వచ్చి ప్రేక్షకులు చూడటం అనుమానమే. పైగా సెప్టెంబర్ దాకా శుక్రవారాలు బ్లాక్ అయ్యాయి. మరి రంగమార్తాండ ఏ రూటు తీసుకుంటాడో వేచి చూడాలి.

This post was last modified on May 15, 2022 7:50 pm

Share

Recent Posts

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

31 minutes ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

47 minutes ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

4 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

9 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

13 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

15 hours ago