గతంలో దిల్ రాజు ప్రకటించినట్టుగా రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సినిమా 2023 సంక్రాంతికి రావడం లేదు. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం వేసవిలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ప్లాన్ కానీ ఆలోచన కానీ లేదట.
అనుకున్న టైంకన్నా వేగంగానే షూటింగ్ జరుగుతున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం శంకర్ తగినంత సమయం ఇవ్వమని కోరడంతో దిల్ రాజు చరణ్ ఇద్దరూ అదే కరెక్ట్ అని భావించి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. ఇందులో చరణ్ రెండు మూడు షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ చేశారని ఆల్రెడీ టాక్ ఉంది. ప్రస్తుతం తను కాలేజ్ స్టూడెంట్ గా వ్యవహరించే ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. అంతకు ముందు రాజమండ్రిలో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం జరుగుతున్న షూట్ లో కియారా అద్వానీ కూడా ఉంది. తాత్కాలికంగా తను బ్రేక్ తీసుకుంది. భూల్ భులాయ్యా 2 ప్రమోషన్ల కోసం ముంబై వెళ్ళింది. అది రిలీజయ్యాక తిరిగి చరణ్ తో జాయినవుతుంది.
ఇప్పటికే ఫోటోలు వీడియోల లీకుల రూపంలో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినా ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్యాన్ ఇండియా లెవెల్ లో మళ్ళీ దీంతోనే తమ హీరో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ.
This post was last modified on May 15, 2022 4:46 pm
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…