సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద బాగానే దూసుకుపోతోంది. విడుదలకు ముందు ఒక్కడు పోకిరి రేంజ్ అని ఊదరగొట్టినంత స్థాయిలో కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కున్న ఫాలోయింగ్ వీకెండ్ కలెక్షన్లను పడిపోకుండా కాపాడుతోంది.
అయితే సోషల్ మీడియాలో మైత్రి సంస్థ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్లు ఇతర హీరోల నుంచి ఫ్యాన్ వార్ కు అవకాశమిచ్చాయి. హైదరాబాద్ లో మొదటి రోజు కొన్ని చోట్ల ఫుల్స్ పడకుండానే నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు పేరుతో ఫిగర్లు ఎలా ఇస్తారని నిలదీయడం మొదలుపెట్టారు.
సరే ఇదంతా సహజమే అనుకోవచ్చు కానీ నిన్న సాయంత్రం మైత్రి మేకర్స్ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నెగటివ్ రివ్యూస్ మీమ్స్ నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి సర్కారు వారి పాట చేరుకుందని ప్రత్యేకంగా ట్వీట్ వేయడం మరింత చర్చకు దారినిచ్చింది.
నిజానికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కామెంట్ చేశారని లేదా ఏదో న్యూస్ ఛానల్ లో సినిమా గురించి ఫ్లాప్ ప్రచారం చేశారని రియాక్ట్ అయితే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఆమాటకొస్తే ఆర్ఆర్ఆర్ బాలేదని తక్కువ రేటింగ్స్ ఇచ్చిన సైట్స్ ఉన్నాయిగా.
నిజంగా సినిమా బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు ముందు మాకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆ మాటకొస్తే టాక్ బావుంటే జనం సోషల్ మీడియాని పట్టించుకోరు. చూడాలని డిసైడ్ అయితే థియేటర్ కు వెళ్ళిపోతారు.
ఫస్ట్ వీక్ కోసం డిసైడ్ చేసిన విపరీతమైన టికెట్ రేట్లు సర్కారు వారి పాట ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిన మాట వాస్తవం. అది విశ్లేషించుకుని ఏం చేస్తే బాగుంటుందాని ఆలోచించాలి కానీ ఇలా రివర్స్ లో నెగటివ్ ప్రచారం చేసిన వాళ్ళను టార్గెట్ చేస్తే అది బూమరాంగ్ అవుతుంది. అందుకే ఈ ట్వీట్ చూడగానే యాంటీ ఫ్యాన్స్ అదేదో తమ ఘనకార్యం అన్నట్టుగా చెప్పుకోవడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on May 15, 2022 4:47 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…