కొవిడ్ దెబ్బకు సినీ పరిశ్రమ ఎంతగా కుదేలైందో తెలిసిందే. మామూలుగానే సినీ రంగంలో సక్సెస్ రేట్ తక్కువ. దీనికి తోడు కొవిడ్ తోడైంది. ఈ టైంలో ఓటీటీల వల్ల అదనపు ఆదాయం సమకూరినా.. థియేటర్ల మీద అది ప్రతికూల ప్రభావం చూపించడం మొదలైంది. కొవిడ్ నష్టాలను భర్తీ చేసుకోవడం కోసమని ప్రభుత్వాల నుంచి టికెట్ల ధరల పెంపుకు అనుమతులు తెచ్చుకుని.. పెద్ద సినిమాలకు తొలి పది రోజుల వరకు ఇంకా రేట్లు పెంచుకుని, అదనపు షోలు వేసుకుని వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకుందామని చూస్తే అది కాస్తా బూమరాంగ్ అవుతోంది.
రాను రాను థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం పడిపోతోంది. టికెట్ల ధరలు పెరిగిపోవడంతో జనాలు కూడా టాక్ చూసుకునే థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి టైంలో సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ కీలకం అవుతోంది. ఐతే ఇక్కడ ఫ్యాన్ వార్స్ పుణ్యమా అని.. సినిమాలకు ఉన్న దాని కంటే ఎక్కువ నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేసి సినిమాలను చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరం.
ఒక హీరో సినిమా రిలీజవుతుంటే.. వేరే హీరోల అభిమానులంతా ఒక్కటై అదే పనిగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. గతంలో మాదిరి ఇప్పుడు యావరేజ్, ఎబోవ్ యావరేజ్ అనే మాటే లేకపోవడానికి ఇదే కారణం. సినిమా అంచనాలకు కొంచెం తక్కువగా ఉంటే చాలు.. పెద్ద డిజాస్టర్ అని ప్రచారం చేయడాన్ని యాంటీ ఫ్యాన్స్ పనిగా పెట్టుకుంటున్నారు. రెండు వారాల కిందట వచ్చిన ‘ఆచార్య’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఊహించని పరాభవం ఎదురైంది. ఆ సినిమా బాలేదనడంలో సందేహం లేదు. కానీ చిరు-చరణ్ లాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు వీకెండ్లో మినిమం ఆక్యుపెన్సీ లేకపోయింది. ఈ సినిమా యుఎస్ ప్రిమియర్స్ మొదలైన కాసేపటికే విపరీతమైన నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలంటే పడని వేరే హీరోల అభిమానులంతా ఒక్కటయ్యారు. అదే పనిగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఇది సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావమే చూపింది.
అప్పుడు ఇలా సినిమాపై దుష్ప్రచారం చేసిన వాళ్లలో మహేష్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని భావించిన మెగా అభిమానులు.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ మీద పడ్డారు. ఈ సినిమా యావరేజ్ కాగా.. డిజాస్టర్ అంటూ అదే పనిగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ మెగా అభిమానులతో పాటు వేరే మిగతా మహేష్ యాంటీ ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. అంతా కలిసి ఈ సినిమాను డిజాస్టర్ చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగతున్నాయి. ఇలా ఫ్యాన్ వార్స్ దెబ్బకు సినిమాలు చచ్చిపోయే పరిస్థితి వస్తోంది. ఒక సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, బయ్యర్లు నిలువునా ముగిసిపోతారని అర్థం చేసుకోకుండా అభిమానులు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి.
This post was last modified on May 13, 2022 1:39 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…