దర్శకుడిగా రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ పూర్తయ్యే సమయానికే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చేసింది. ప్రతి సన్నివేశాన్నీ చాలా టైం తీసుకుని చెక్కుతుంటంతో అమరశిల్పి జక్కన పేరును ఆయనకు తగిలించేశారు జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల.
ఇక ఆ తర్వాతి కాలంలో ఆ పేరును సార్థకం చేసుకుంటూ ప్రతి సినిమానూ తనదైన శైలిలో చెక్కుతూ సాగిపోతున్నాడు జక్కన్న. గత పుష్కర కాలంలో రాజమౌళి ఏ సినిమా కూడా చెప్పిన సమయానికి విడుదల కాలేదు. ప్రతిదీ ఆలస్యవమతోంది.
చివరికి 2020 జులై 30న రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ను కూడా వాయిదా వేయక తప్పలేదు. జులై 30న కచ్చితంగా సినిమా వస్తుందా అని పోయినేడాదే విలేకరులు అడిగితే.. 2020లో మాత్రం గ్యారెంటీ అన్నాడు. కానీ మాట నిలబెట్టుకోలేకపోయాడు.
కేవలం సినిమాలు వాయిదా వేయడమే కాదు.. తన సినిమాలకు సంబంధించి ఏవైనా విశేషాలు పంచుకోవాలన్నా జక్కన్న సమయ పాలన పాటించట్లేదు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరిచుకుని ఉదయం 10 గంటలకు ఓ సర్ప్రైజ్ అంటూ ఊరించాడు ఎన్టీఆర్. తీరా చూస్తే చెప్పిన సమయానికి ఆ సర్ప్రైజ్ బయటికి రాలేదు. అందరూ డిజప్పాయింట్ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు ముహూర్తాన్ని మార్చారు. రాజమౌళి జోక్యంతోనే ఈ ఆలస్యం అని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో అభిమానులకు మండిపోయింది.
రాజమౌళి మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ.. ఇలా ప్రతిసారీ వాయిదాల పర్వంతో నిరాశ పరుస్తుండటం అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఇలా ఆలస్యం చేయడాన్ని.. వాయిదాలు వేయడాన్ని రాజమౌళి సెంటిమెంటుగా ఏమైనా భావిస్తున్నాడా అంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయనకు డిలే మౌళి, వాయిదాల మౌళి అంటూ కొత్త పేర్లు పెడుతూ తమ అసహనాన్ని చాటుకుంటున్నారు.
"మేము ఆడుకునేవాళ్ళం కాదు..." ఈ మాటలు అన్నది ఎవరో దారినపోయే దానయ్య కాదు. ఏళ్ళ తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్…
ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుగా పనిచేస్తున్నారని, ఈ స్పీడు చూస్తే.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు అనుకున్న సమయానికంటే కూడా…
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్)పై దేశంలోని పలు రాష్ట్రాలు అభ్యంతరం…
ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచలన రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్.. స్వల్పకాలంలోనే 10 లక్షల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఒక సినిమా కోసం సన్నాహాలు జరిగి.. ఏడాదికి…
క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…