‘‘మీకప్పుడే పెళ్లేంటి.. చిన్న పిల్లాడైతేనూ’’.. అని వెన్నెల కిషోర్ అంటే.. ‘‘అందరూ అదే అంటున్నారయ్యా.. దీనెమ్మా మెయింటైన్ చేయలేక ***’’ అని మహేష్ అంటాడు. ‘సర్కారు వారి పాట’లో అందరినీ ఆకట్టుకున్న డైలాగ్స్ ఇవి. సినిమాలో ఫన్ కోసం పెట్టినా.. నిజ జీవితంలో మహేష్‌కు ఉన్న ఇమేజ్ అదే. మామూలుగా మహేష్‌ను చూపించి అతడి వయసు ఎంత అంటే 30 ప్లస్ అంటారే తప్ప.. 46 ఏళ్లు అంటే అస్సలు నమ్మరు.
అంత బాగా బాడీని మెయింటైన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఐతే ఈ మెయింటైనెన్స్ వెనుక చాలా కష్టమే ఉంటుంది. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇష్టమైనవి ఎన్నో పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో ఆ త్యాగాల గురించే మాట్లాడాడు మహేష్. ఇన్నేళ్లొచ్చినా ఇలా బాడీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తే.. ప్రశాంతంగా ఉండటమే తన గ్లామర్ రహస్యమని చెప్పాడు మహేష్.
తిండి విషయానికి వస్తే.. పదేళ్ల నుంచి జంక్ ఫుడ్ జోలికే వెళ్లట్లేదని మహేష్ స్ఫష్టం చేశాడు. అంతే కాక డైరీ ప్రాడక్ట్స్ ఏవీ కూడా తాను ముట్టుకోనని చెప్పాడు. పెరుగన్నం, కేక్, బర్గర్.. ఈ మూడింట్లో మీకు ఏది ఇష్టం అని యాంకర్ సుమ అడిగితే.. డైరీ ప్రాడక్ట్ కాబట్టి పెరుగన్నం ముట్టుకోనని.. అలాగే జంక్ ఫుడ్ కావడంతో కేక్, బర్గర్ జోలికి వెళ్లనని తేల్చేశాడు. ఇలా ఎప్పట్నుంచి అని అడిగితే.. పదేళ్ల ముందే వీటిని వదిలేసినట్లు చెప్పాడు మహేష్.
మరి అవి తినాలన్న కోరికను ఎలా చంపుకున్నారు అని అడిగితే.. అందరి లాగే తనకు కూడా వాటిని తినాలన్న కోరిక ఉండేదని.. కానీ కష్టపడి అణుచుకున్నానని.. ఇలా కొన్ని రోజులు అలవాటు చేసుకున్నాక పెద్ద కష్టం అనిపించదని.. నియంత్రణ దానంతట అదే వచ్చేస్తుందని మహేష్ తెలిపాడు. మామూలు సమయాల్లో తనకు తానుగా ఇలాంటి ఫుడ్ అసలు ముట్టుకోనని.. కానీ పిల్లలతో ఏదైనా పార్టీ చేసుకున్నపుడు మాత్రం లైట్‌గా తీసుకుంటానని మహేష్ వెల్లడించాడు.
This post was last modified on May 11, 2022 5:46 pm
అసలు శతదినోత్సవం అనే మాటే సినీ పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. మూడు నాలుగు వారాలకు బ్రేక్ ఈవెన్ అయితే అదే…
ఈ రోజు సాయంత్రం జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రి సిద్ధమయ్యింది. సుమారు లక్షన్నర మందికి…
సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో…
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య…
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర…