ఏడాది పాటు టాలీవుడ్ జనాల్ని ఏడిపించి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల ముందే టికెట్ల ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. ఇక్కడ పైశాచిక ఆనందం అని వాడటం కొందరికి అభ్యంతరకరంగా అనిపించొచ్చేమో.
కానీ పేదల కోసం రేట్లు తగ్గిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. ఓ వైపు నిత్యావసరాల ధరలన్నీ అసాధారణంగా పెంచేసి ఆ పేదలు సైతం థియేటర్ల యాజమాన్యాలను చూసి జాలి పడేలా చిన్న సెంటర్లలో 5, 10, 20 రూపాయల రేట్లు పెట్టడాన్ని ఏమనాలి? కొన్ని నెలల పాటు పేదల కోసం రేట్లు తగ్గించామని ఊదరగొట్టి.. ఇండస్ట్రీ జనాలు వచ్చి తన ముందు సాగిలపడగానే రేట్లు పెంచేయడాన్ని ఎలా చూడాలి? మరి కొన్ని నెలల్లోనే ఏపీలోని పేదలందరూ షావుకార్లు అయిపోయారా? సాధారణ స్థాయిలో పెంచిన రేట్లు సరిపోవని ఇప్పుడు పెద్ద సినిమాలకు అదనంగా రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు? పైగా టికెట్ల ధరలు, అదనపు షోల విషయంలో తమకు అనుకూలంగా ఉన్న వారి సినిమాలకు ఒకలా.. గిట్టని వాళ్ల చిత్రాల విషయంలో ఇంకోలా వ్యవహరించడం ఏం న్యాయం?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చేవాళ్లు కనిపించరు. ఒక రూల్ అంటూ పెట్టాక అది అందరికీ ఒకేలా వర్తించాలి. కానీ జగన్ సర్కారు ఒక్కో సినిమాకు ఒక్కోలా వ్యవహరిస్తుండటం విడ్డూరం. సాధారణ రేట్ల మీద అదనంగా రేట్లు పెంచుకునేందుకు కొన్ని షరతులు పెట్టి.. అవి వర్తించని వాటికి ఆఫర్ ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
హీరో, హీరోయిన్, దర్శకుడు ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూ పారితోషకాలు కాకుండా వంద కోట్ల బడ్జెట్ అయిన సినిమాలు, అందులోనూ 20 శాతం ఏపీలో షూటింగ్ జరుపుకున్న వాటికే అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించాలన్నది రూల్. జీవోలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు 20 శాతం రూల్ వర్తించదు అనుకుందాం.
కానీ వీళ్లు చెప్పిన ప్రకారం బడ్జెట్ వంద కోట్లు దాటకున్నా గత నెలలో ‘ఆచార్య’ సినిమాకు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కు అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఎలా కల్పించారన్నది అర్థం కాని విషయం. అసలు ఈ సినిమాల బడ్జెట్ల వివరాలను వాటి నిర్మాతలు ప్రభుత్వానికి సమర్పించాయా.. ప్రభుత్వం వైపు నుంచి పరిశీలన జరిపాకే రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారా అన్నది సందేహమే.
కేవలం చిరంజీవి, మహేష్.. జగన్‌ను కలవడం, ఆయన పట్ల పరోక్షంగా సానుకూలత కనబరచడం వల్లే ఈ సౌలభ్యం కల్పించారని.. రేప్పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ వస్తే దానికి మాత్రం నిబంధనల పేరు చెప్పి రేట్ల పెంపు రాకుండా కచ్చితంగా అడ్డుకుంటారని.. కేవలం తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్‌ను, ఇంకా తమకు గిట్టని వాళ్లను టార్గెట్ చేయడానికే ఈ రూల్ అన్న అభిప్రాయం జనాల్లో బలంగా కలుగుతోంది.
This post was last modified on May 10, 2022 4:10 pm
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…