ఈ రోజుల్లో ఏ సినిమా చేయాలి, ఏది వద్దు అని హీరోయిన్లకు ఛాయిస్‌లు ఉండటం తక్కువ. వాళ్ల కెరీర్ స్పాన్ బాగా తగ్గిపోయిన నేపథ్యంలో నచ్చిన పాత్రలే చేస్తా.. క్యారెక్టర్ కథలో కీలకమైందైతేనే ఒప్పుకుంటా అని అంటే కష్టం. ఇలా ఛాయిస్ తీసుకునే హీరోయిన్లు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు కాంబినేషన్ క్రేజ్ చూసో, పారితోషకానికి ఆశపడో అయిష్టంగానే కొన్ని సినిమాలు చేస్తుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఇప్పటిదాకా అలాంటి ప్రాజెక్టుల్లో భాగం కాలేదు. ఆమె పారితోషకాలకు టెంప్ట్ అవ్వలేదు. కాంబినేషన్లు చూసి కళ్లు మూసుకుని సినిమాలు చేసేయలేదు.
కెరీర్లో డీసెంట్ హిట్లున్నప్పటికీ.. తన కెరీర్లో అనుకున్నంత ఊపు లేకపోవడానికి కారణమిదే. చివరగా తెలుగులో శ్యామ్ సింగ రాయ్‌తో ఆమె హిట్టు కొట్టింది. కానీ తర్వాత ఆమె వార్తల్లోనే లేదు. తన కొత్త సినిమాల ఊసులేవీ వినిపించలేదు. దీంతో సాయిపల్లవి పనైపోయిందనే కామెంట్లు వినిపించాయి.
కానీ సాయిపల్లవి సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఒక్కసారిగా ఆమె పేరు చర్చనీయాంశం అయ్యేలా వరుసగా అనౌన్స్‌మెంట్లు వస్తున్నాయి. చాన్నాళ్లుగా మరుగున పడి ఉండి, అతీగతీ లేకుండా పోయిన విరాటపర్వం ఎట్టకేలకు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం సాయిపల్లవి అభిమానులకు తీపి కబురే. సాయిపల్లవి చాలా ప్రత్యేకమైన పాత్ర చేసిన సినిమాలా ఇది కనిపిస్తోంది. చాలా ఆలస్యం జరిగినప్పటికీ ఈ సినిమాపై ఆసక్తి తగ్గలేదు.
ఇక సోమవారం సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. అవి రెండూ క్రేజీ ప్రాజెక్టులనే చెప్పాలి. సాయిపల్లవి ప్రధాన పాత్రలో ‘గార్గి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్రకటించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు లెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ హీరోగా నటించే సినిమాలో సాయి పల్లవిని కథానాయికగా ఎంచుకున్నారు. రాజ్ కుమార్ పెరియ స్వామి దీనికి దర్శకుడు. మొత్తంగా సాయిపల్లవి పుట్టిన రోజు ముంగిట ‘విరాటపర్వం’ రిలీజ్ ఖరారవడం, బర్త్ డేకి కొత్తగా రెండు ఆసక్తికర ప్రాజెక్టులు ప్రకటించడంతో సాయిపల్లవి గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి.
This post was last modified on May 10, 2022 11:06 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…