విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ చాలానే ఉన్నాయి. అందులో ‘ప్రేమించుకుందాం రా’ మొదటి వరుసలో ఉంటుంది. 1997 లో రిలీజైన ఈ సినిమా నేటితో పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ‘ప్రేమించుకుందాం రా’ కంటే ముందు జయంత్ సీ పరాన్జీ దర్శకుడిగా సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా ఓ సినిమా మొదలైంది. కథ విషయంలో ఏదో సందేహం ఉండటంతో మొదటి షెడ్యుల్ అనంతరం ఆ సినిమాను డ్రాప్ చేశారు. మూడేళ్ళ తర్వాత సురేష్ బాబు దీన్ రాజ్ చెప్పిన ‘ప్రేమించుకుందాంరా’ కథను ఒకే చేసి ప్రాజెక్ట్ ని దర్శకుడు జయంత్ చేతిలో పెట్టాడు.
ఒరిజినల్ స్క్రిప్ట్ లో వెంకటేష్ కి లవ్ ట్రాక్ లేదు. అంతకుముందే వెంకీ ఓ పిల్లాడికి తండ్రిగా ఫ్యామిలీ సినిమా చేసేయడంతో లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేయరేమో అని భావించి సురేష్ బాబు ఆ కథనే ఒకే చేశారు. కానీ దర్శకుడు జయంత్ ఒప్పుకోలేదు. వెంకటేష్ ని హీరోగా పెట్టుకొని లవ్ ట్రాక్ లేకపోవడం, అక్క కొడుకు లవ్ కి హెల్ప్ చేయడం అంటే బాగోదని భావించి పరుచూరి బ్రదర్స్ ని సీన్ లోకి దింపాడు. తర్వాత పరుచూరి బ్రదర్స్ ,దీన్ రాజ్ , జయంత్ , సురేష్ బాబు స్క్రిప్టింగ్ లో కూర్చొని చాలా డిస్కషన్స్ జరపడంతో ఫైనల్ గా గిరి -కావేరి లవ్ ట్రాక్ట్ క్రియేట్ అయిందట.
ఇక రిలీజ్ రోజు విజయవాడలో మార్నింగ్ షో చూసిన దర్శకుడు జయంత్ ఫస్ట్ హాఫ్ కి ఊహించిన రెస్పాన్స్ కనిపించకపోవడంతో తన మొదటి సినిమా ఫ్లాప్ అని మనసలో అనుకున్నాడట. కట్ చేస్తే సెకండాఫ్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే అది మాస్ థియేటర్ కావడంతో ఫస్ట్ హాఫ్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ రాలేదని పసిగట్టారట. ఫైనల్ గా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకొని 175 డేస్ ఆడింది. చాలా చోట్ల రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నటుడు జయ ప్రకాష్ రెడ్డి వరుసగా విలన్ అవకాశాలు సొంతం చేసుకొని బాగా బిజీ అయిపోయాడు. కావేరిగా కుర్రకారు గుండెల్లో అంజలా జవేరి గుడి కట్టేసుకొని టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. నిర్మాతగా సురేష్ బాబుకి భారీ వసూళ్లు తెచ్చిపెట్టి మంచి ప్రాఫిట్స్ అందించింది.
This post was last modified on May 9, 2022 5:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…