ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంత ముఖ్యమో దాని సపోర్ట్ కూడా అంతే కీలకం. అఫ్కోర్స్ సక్సెస్ కూడా వెంట ఉంటేనే ఇక్కడ అవకాశాలు, సినిమాల రిలీజులు క్యూ కడతాయి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు.
మెగాస్టార్ చిన్నల్లుడిగా తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడినట్టే కనిపిస్తోంది. ఆ మధ్య సూపర్ మచ్చి అనే కళాఖండం వచ్చింది. మొదటిరోజే డెఫిషిట్లతో వారం దాటకుండానే థియేటర్ల నుంచి మాయమయ్యింది. మొన్నెప్పుడో ప్రైమ్ లో వస్తే కానీ ప్రేక్షకులు గుర్తించలేకపోయారు.
డెబ్యూ మూవీ విజేత కాస్త నయం. హాళ్లలో ఆడకపోయినా అంతో ఇంతో టీవీలో వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడితని మూడో సినిమా కిన్నెరసాని విడుదలకు సిద్ధంగా ఉన్నా ల్యాబ్ నుంచి బయటికి రావడం లేదు. ట్రైలర్ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేశారు.
రెండు మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. అంతే దాని తరువాత అంతా గప్ చుప్. రామ్ తాళ్ళూరి లాంటి బలమైన నేపథ్యం ఉన్న నిర్మాత తీసినప్పటికి ఇది అసలు ఎప్పుడు వస్తుందో ఎవరికీ అర్థం కానీ విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
కళ్యాణ్ దేవ్ కు మెగా ఫ్యామిలీతో గ్యాప్ వచ్చేసిందని, శ్రీజతో కూడా కలిసి ఉండట్లేదని రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా తర్వాత పరిణామాలు జరిగాయి. కళ్యాణ్ దేవ్ మీడియా ముందుకు రావడం మానేశాడు.
నాగశౌర్యతో అశ్వద్ధామ తీసిన రమణతేజ ఈ కిన్నెరసానికి దర్శకుడు. అతనూ సైలెంట్ గానే ఉన్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని ఒకవేళ ఓటిటిలో ఇచ్చే ఆలోచన ఉంటే అదైనా త్వరగా చేస్తే బెటర్. ఆలస్యం జరిగే కొద్ది ఆల్రెడీ జీరోలో ఉన్న బజ్ మైనస్ కు చేరుకుంటుంది
This post was last modified on May 9, 2022 12:45 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…