Movie News

కొడితే.. డైరెక్ట్ టాప్ లీగ్‌లోకే


ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత, ప్రతి హీరో కూడా తాము తీసిన సినిమా సూపరో సూపర్ అనే అంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం వాళ్ల మాటలు మొక్కుబడిగా అనిపించవు. వాళ్లది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగానూ అనిపించదు. ‘సర్కారు వారి పాట’ టీం కాన్ఫిడెన్స్ చూసినపుడు ఇండస్ట్రీ జనాలకు కూడా సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమా స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అనే చర్చ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా నడుస్తోంది. యూనిట్ సభ్యులతో పాటు సినిమా రష్ చూసిన వాళ్లంతా సక్సెస్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.

ట్రైలర్, ఇతర ప్రోమోలు చూసిన ప్రేక్షకులకు కూడా సినిమా మీద బాగానే గురి కుదిరింది. కథాకథనాల పరంగా కొత్తగా లేకపోయినా.. ఓ పెద్ద హీరో నటించిన కమర్షియల్ సినిమా నుంచి ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయని.. ఆ ఆకర్షణలే సినిమాను నడిపించేస్తాయని, మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదని చిత్ర వర్గాల సమాచారం.

‘సర్కారు వారి పాట’ విషయంలో అందరికంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నది దర్శకుడు పరశురామే. ఈ సినిమా సక్సెస్ కావడం అందరి కంటే అతడికే ఎక్కువ అవసరం. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్‌, కీర్తి సురేష్, నిర్మాతల కెరీర్లో పెద్ద మార్పేమీ ఉండదు. కానీ ఇది అంచనాలకు తగ్గట్లు ఆడితే పరశురామ్ వేరే లెవెల్‌కు వెళ్లిపోతాడు. తేడా కొడితే ఇక మళ్లీ అతడికి ఇలాంటి పెద్ద ప్రాజెక్టు రాకపోవచ్చు. తిరిగి మీడియం రేంజ్ సినిమాల్లోకి వెళ్లిపోతాడు.

‘యువత’ లాంటి చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన పరశురామ్.. మహేష్‌తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే స్థాయికి వస్తాడని కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ అంచనాల్లేవు. బహుశా పరశురామ్ కూడా తాను ఈ స్థాయి సినిమా తీస్తానని ఊహించి ఉండడు. ఎందుకంటే ఆరేళ్ల ముందు కూడా పరశురామ్.. అల్లు శిరీష్ లాంటి హీరోతో ‘శ్రీరస్తు శుభమస్తు’ చేశాడు. ఆ తర్వాత అతను తీసిన ‘గీత గోవిందం’ కూడా మొదలయ్యే సమయానికి చిన్న ప్రాజెక్టే. కానీ దానికి అనూహ్యంగా క్రేజ్ వచ్చి, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. దీంతో పరశురామ్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదృష్టం కొద్దీ మహేష్.. వంశీ పైడిపల్లితో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం, అదే సమయంలో పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ‘సర్కారు వారి పాట’ ఓకే అయింది. మహేష్ నమ్మకాన్ని నిలబెట్టే సినిమానే అతడు తీశాడని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజమైతే అతను ఒకేసారి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లీగ్‌లోకి వెళ్లిపోతాడనడంలో సందేహం లేదు.

This post was last modified on May 8, 2022 7:41 pm

Share
Show comments

Recent Posts

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

52 minutes ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

1 hour ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

1 hour ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

2 hours ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

2 hours ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

3 hours ago