మామూలుగా స్టార్ హీరోలు చేసే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర నామమాత్రంగా ఉంటుంది. హీరోకు జోడీ ఉండాలి కాబట్టి హీరోయిన్ని పెట్టడం.. మొక్కుబడిగా కొన్ని సీన్లు లాగించేయడం.. రెండు మూడు పాటల్లో హీరోతో కలిసి స్టెప్పులేయించడం.. ఇదే ఫార్మాట్ అనుసరిస్తుంటారు హీరోయిన్ల విషయంలో. రిలీజ్ ముంగిట హీరోయిన్ల పాత్రల గురించి ఆహా ఓహో అని చెబుతుంటారు కానీ.. తీరా సినిమాలో చూస్తే వాళ్ల క్యారెక్టర్లు తేలిపోతుంటాయి.
ఈ మధ్యే రిలీజైన ‘బీస్ట్’ మూవీలో పూజా హెగ్డే పాత్ర ఎంత నామమాత్రంగా తయారైందో తెలిసిందే. రిలీజ్ ముంగిట పూజా తెగ హడావుడి చేయగా.. సినిమా చూసిన జనాలు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. అందుకే హీరోయిన్ల పాత్రల విషయంలో ప్రేక్షకులు చాలా తక్కువ అంచనాలతోనే థియేటర్లకు వెళ్తుంటారు. కానీ ఈ గురువారం విడుదల కాబోతున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి పాత్ర అంత నామమాత్రంగా అయితే ఉండదన్నది చిత్ర వర్గాల సమాచారం.
మామూలుగానే కీర్తి మరీ మొక్కుబడి పాత్రలు చేయట్లేదు. కమర్షియల్ సినిమాల్లో అయినా సరే.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలాగే చూసుకుంటోంది. ‘మహానటి’తో తనపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఆచితూచి పాత్రలు ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’లో కళావతి పాత్రను కేవలం కాంబినేషన్ క్రేజ్ చూసి ఎంచుకుందా.. తన పాత్ర నచ్చే ఓకే చేసిందా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
ఐతే ట్రైలర్ చూస్తే కీర్తి పాత్రకు కొంచెం ప్రాధాన్యం ఉన్నట్లే కనిపించింది. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ చెప్పిన మాటలు చూస్తే కీర్తికిది స్పెషల్ రోలే అనిపిస్తోంది. హీరోయిన్ పాత్ర చాలా స్పెషల్ అని, తన ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారని మహేష్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. మహేష్ అంతగా చెప్పాడంటే కీర్తి ఈ సినిమాలో మ్యాజిక్ చేయబోతున్నట్లే కనిపిస్తోంది. ‘మహానటి’ తర్వాత ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, అటు స్టార్లతో నటించిన చిత్రాలు రెండూ కూడా కీర్తికి నిరాశనే మిగిల్చాయి. ఐతే ఇటీవల ‘చిన్ని’ సినిమాతో నటిగా తనేంటో మళ్లీ రుజువు చేసింది కీర్తి. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ లాంటి కమర్షియల్ సినిమాతోనూ సక్సెస్ సాధిస్తే కీర్తి కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లే.
This post was last modified on May 8, 2022 4:25 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…