యువ కథానాయకుడు విశ్వక్సేన్ కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి హైదరాబాద్‌లో స్పెషల్ ప్రిమియర్స్ వేయగా.. దాన్నుంచి మంచి టాకే వచ్చింది. ఐతే సెలబ్రెటీలకు వేసే ఇలాంటి షోల నుంచి వచ్చే టాక్‌ను నమ్మడానికి వీల్లేదని గతంలో కొన్ని సినిమాలు రుజువు చేసిన నేపథ్యంలో ప్రేక్షకులు సామాన్య ప్రేక్షకుల టాక్ కోసం ఎదురు చూశారు.
యుఎస్ ప్రిమియర్స్ నుంచే మంచి రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు మంచి టాకే వచ్చింది. విశ్వక్సేన్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా నెమ్మదస్తుడు, బిడియస్తుడు, మొహమాటస్తుడిగా కనిపించిన అర్జున్ పాత్ర అందరికీ కొత్తగా అనిపిస్తూ బాగా నచ్చుతోంది. సినిమాకు అతడి క్యారెక్టరే మేజర్ హైలైట్ అని అందరూ అంటున్నారు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ విషయానికి ఆమె పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు.
నిజానికి ప్రోమోల్లో అంతా ఆమే హైలైట్ అయింది కానీ.. సినిమా విషయానికి వచ్చేసరికి ఆమె పాత్ర ఒక దశ దాటాక పక్కకు వెళ్లిపోయింది. సినిమా చివరికి వచ్చేసరికి రుక్సర్ లీడ్ హీరోయిన్‌లానే అనిపించలేదు. హీరోయిన్ చెల్లెలిలా మొదట్లో మామూలుగా కనిపించే రితిక నాయక్ అనే కొత్తమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. పోను పోనూ ఈ పాత్రే హైలైట్ అవుతూ చివరికి వచ్చేసరికి అది బలమైన ముద్రే వేస్తుంది.
అందానికి అందం, చక్కటి అభినయంతో ఆకట్టుకున్న రితిక బేసిగ్గా వ్లాగర్ కమ్ మోడల్. తెలుగులో ఆమెకిదే తొలి చిత్రం. సినిమాలో ఆమెది కీలక పాత్ర అయినా.. తనే హైలైట్ అయినా ప్రోమోల్లో ఎందుకో ఆమెను హైలైట్ చేయలేదు. రుక్సరే కథానాయికలా కనిపించింది. కానీ సినిమా చూసిన వాళ్లకు ఈమె పాత్ర పెద్ద సర్ప్రైజ్ లాగా కనిపించింది. కుర్రాళ్లంతా తనతో ప్రేమలో పడిపోవడం ఖాయం. ఈ సినిమా తర్వాత రితికకు మంచి అవకాశాలు రావచ్చు.
This post was last modified on May 6, 2022 4:58 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…