మాములుగా క్రేజ్ ఉన్న స్టార్ సినిమా థియేటర్ లోనో ఓటిటిలోనో వస్తోందంటే ఒకరకమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామాని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రైమ్ లో రేపు విడుదల కాబోతున్న కీర్తి సురేష్ చిన్ని(సాని కడియం) గురించి ఎక్కడా చప్పుడే లేదు. మాములుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లకి ఓ రేంజ్ లో హడావిడి చేసే అమెజాన్ ప్రైమ్ ఏమంత సౌండ్ చేయడం లేదు. కనీసం రిలీజ్ అవుతోందన్న అవగాహన కూడా కామన్ ఆడియెన్స్ కి లేకుండా పోయింది. అంత వీక్ పబ్లిసిటీ మరి.
అలా అని కీర్తి సురేష్ కి ఫాలోయింగ్ తగ్గిందనో ఇమేజ్ లేదనో కాదు. కాకపోతే గత రెండేళ్లలో తనను ప్రధాన పాత్రలో బేస్ చేసుకుని వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. పెంగ్విన్ ఇదే ప్రైమ్ లో డిజాస్టర్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మిస్ ఇండియా ఇంకా దారుణం. ఇలా తీశారేమని విమర్శకులు తలంటారు. ఇవి కాకుండా సాహసం చేసి థియేటర్లలో వదిలిన గుడ్ లక్ సఖి కొన్నవాళ్లకు బ్యాడ్ డ్రీమ్ అయ్యింది. దెబ్బకు తనను సోలో లీడ్ క్యారెక్టర్స్ లో చూసేందుకు జనం అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఈ వీక్ బజ్.
చిన్నిలో ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవన్ చాలా కీలకమైన క్యారెక్టర్ చేశారు. తనవాళ్లను అన్యాయంగా కోల్పోయిన ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి దానికి కారణమైన వాళ్ళను దారుణంగా చంపి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంది. ఇరవై నాలుగు మర్డర్లు చేసి పోలీసులకు దడ పుట్టిస్తుంది. ఇది చిన్ని కథ. పాయింట్ పాతదే కానీ దర్శకుడు అరుణ్ మాతేష్వరన్ కొత్తగా ప్రెజెంట్ చేశారట. సర్కారు వారి పాటలో ఫుల్ గ్లామరస్ గా కనిపించనున్న కీర్తి సురేష్ ని అంతకన్నా ముందు ఇంత రఫ్ రా క్యారెక్టర్ లో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రాత్రి 12కు ముందే స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on %s = human-readable time difference 8:30 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…