‘సర్కారు’ … ట్విస్ట్ అదేనా ?

మహేష్ బాబు , పరశురాం కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ పై బజ్ స్టార్టయింది. మొన్నటి వరకూ సినిమాపై ఉన్న ఓ మోస్తారు అంచనాలని ట్రైలర్ అమాంతంగా పెంచేసింది. మహేష్ నుండి ఫ్యాన్స్ , ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో సరిగ్గా అవన్నీ సినిమాలో ఉంటాయని ట్రైలర్ తో చూపించేశాడు దర్శకుడు. అయితే సినిమాలో దీనికి మించి అదిరిపోయే కంటెంట్ ఉంటుందని యూనిట్ గట్టిగా చెప్తోంది. అలాగే పోకిరి తరహాలో ఇందులో ఓ ట్విస్ట్ ఉంటుందని దానికి ఆడియన్స్ ఫిదా అవ్వడం ఖాయమని ఇన్సైడ్ టాక్.

ట్రైలర్ చూస్తే మహేష్ బ్యాంక్ లో అమౌంట్ రికవరీ చేసే పెర్సన్ గా కనిపిస్తున్నాడు. కానీ తను బ్యాంక్ ఓనర్ అనే సాలిడ్ ట్విస్ట్ తో పరశురాం ఏదో ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక కీర్తి చుట్టూ చక్కర్లు కొట్టడం ఆమెని ప్రేమలో పడేయడం వెనుక కూడా ఏదో ట్విస్ట్ ఉంటుందని విలన్ ని పట్టుకునేందుకు హీరోయిన్ ని హీరో వాడుకుంటాడని ఓ లీక్ చక్కర్లు కొడుతుంది.

నిజానికి ఓ బడా సినిమా వస్తుంటే రిలీజ్ కి ముందు ఆ సినిమా చుట్టూ ఇలాంటి లీక్స్ వినిపిస్తూనే ఉంటాయి. సర్కారు చుట్టూ కూడా ఇలాంటి లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో నిజమెంత ? అసలు ఈ ట్విస్టులు సినిమాలో ఉంటాయా అనేది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉండటంతో టీం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆచార్య’ తో ఊపు తగ్గిన బాక్సాఫీస్ ని ఈ సినిమాతో మహేష్ ఎలా సెట్ చేస్తాడో చూడాలి.