ప్రస్తుతం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ పెర్ఫామర్ల జాబితాలో అగ్ర భాగాన నిలిచే అమ్మాయి సాయిపల్లవి. ఒక పెర్ఫామెన్స్ కోసం లక్షల మంది థియేటర్లకు రావడం అన్నది సాయిపల్లవి లాంటి అది కొద్దిమంది హీరోయిన్ల విషయంలోనే జరుగుతుంది.
నయనతార, అనుష్క కూడా ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లే కానీ.. వాళ్లకు నటనతో పాటు అందచందాలు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ పాయింట్లే. ఐతే సాయిపల్లవి గ్లామర్ విషయంలో వాళ్లతో పోలిస్తే వెనుకే ఉంటుంది. కేవలం ఆమె పెర్ఫామెన్స్ చూడాలనే ఆశతోనే ప్రేక్షకులు తన సినిమాలకు వెళ్తారు.
ఈ విషయంలో హీరోలతో సమానమైన ఆకర్షణ ఆమెది. కొన్నిసార్లు హీరోలను సైతం ఆమె డామినేట్ చేస్తుంటుంది. తనే హైలైట్ అవుతుంటుంది. అందుకే ఆమెతో చేయడానికి హీరోలు సైతం కంగారు పడిపోతుంటారు. అలాంటిది సాయిపల్లవి ఉన్న సినిమాలో మరో హీరోయిన్ ఉంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటిదాకా సాయిపల్లవి నటించిన సినిమాల్లో చాలా వరకు ఆమె సోలో హీరోయిన్‌గా ఉన్నవే. తొలి సినిమా ‘ప్రేమమ్’లో నటించేటప్పటికి ఆమె సత్తా ఏంటో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ సాయిపల్లవినే హైలైట్ అయింది. ఆ తర్వాతి నుంచి ఆమెను సోలో హీరోయిన్‌గానే చూస్తున్నాం.
ఐతే నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’లో ముగ్గురు హీరోయిన్లుంటారని, అందులో ఒకరు సాయిపల్లవి అని వార్త బయటికి వచ్చింది. మిగతా ఇద్దరు హీరోయిన్లెవరన్నది తెలియదు. ఐతే సాయిపల్లవి ఉన్న సినిమాలో మిగతా రెండు హీరోయిన్ పాత్రలకు ఎవరు ముందుకొస్తారన్నది సందేహం. సాయిపల్లవి ఉందంటే ఆమె మనల్ని తినేస్తుంది.. తనుండగా మనం ఏం హైలైట్ అవుతాం అన్న భయం హీరోయిన్లలో ఉండకపోదు.
ఐతే నాని, రాహుల్ సంకృత్యన్ లాంటి కాంబినేషన్ చూశాక ఈ సినిమా చేస్తే బాగుంటుందన్న ఆశా పుడుతుంది. ఐతే పేరున్న హీరోయిన్లయితే ఇందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశమైతే లేదు. మరి ఆ రెండు పాత్రల్లో ఎవరు ఫిక్సవుతారో చూడాలి.
This post was last modified on June 26, 2020 10:01 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…