ఎన్ని మల్టీప్లెక్సులు ఉన్నా హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉండే సింగల్ స్క్రీన్ల క్రేజే వేరు. అందుకే బెనిఫిట్ షోలను అక్కడ చూస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. ముఖ్యంగా దేవి కాంప్లెక్స్ లో జరిగే అల్లరి తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లైనా.
ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు సుదర్శన్ 35 ఎంఎం మీదున్న సెంటిమెంట్ ఎమోషన్ దేని మీద లేదు రాదు. సూపర్ స్టార్ శతదినోత్సవాలు సిల్వర్ జూబ్లీలు అందులోనే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కాని నిన్నటిదాకా సర్కారు వారి పాట ఈ విషయంలో టెన్షన్ పడింది.
ఎందుకంటే RRR మే 12కి నలభై ఎనిమిదో రోజులో ఉంటుంది. సుదర్శన్ 35 ఎంఎం మెయిన్ థియేటర్ కావడంతో అందులోనే ఫిఫ్టీ డేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి పూర్తిగా తీసేయడం కుదరదు. పైగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోల అభిమానులతో ముడిపడిన వ్యవహారం.
దీంతో సర్కారు వారి పాటకు వేరే స్క్రీన్లు కేటాయించి మే 27న విడుదలయ్యే ఎఫ్3కి సుదర్శన్ 35 ఎంఎం ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు మే 12న సర్కారు వారి పాట సుదర్శన్ లోనూ ఉంటుంది. కాకపోతే రెండు లేదా మూడు షోలు మాత్రమే ఉంటాయి. మిగిలినవి ఆర్ఆర్ఆర్ వేస్తారు. అర్ధశతదినోత్సవం కాగానే సర్కారు రెగ్యులర్ షోస్ తో అందులోనే కంటిన్యూ అవుతుంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని తెలిసింది. సో ఒక్కడు, పోకిరి, మురారి, దూకుడు, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆడిన సుదర్శన్ 35 ఎంఎంలోనే సర్కారు కూడా అడుగుపెట్టబోతున్నాడు. సో సెంటిమెంట్ మిస్ కావడం లేదు.
This post was last modified on May 5, 2022 3:07 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…