Movie News

కమల్ మెగా మూవీ.. హాట్ స్టార్‌లో

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాల మాదిరి భారీతనం లేకపోవచ్చు.. మాస్ ప్రేక్షకుల్లో వాటికున్న క్రేజ్ లేకపోవచ్చు.. పాన్ ఇండియా బ్రాండు లేకపోవచ్చు.. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’కు ఓ వర్గం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కమల్ ఎంత గొప్ప నటుడో, ఆయన స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లెజెండరీ యాక్టర్‌తో ఈ తరంలో ఉత్తమ నటులుగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన ‘విక్రమ్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కోట్లల్లోనే ఉన్నారు.

కలలో కూడా ఊహించలేని ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమా తీశాడు. వీరి కోసం లోకేష్ ఎలాంటి పాత్రలు తీర్చిదిద్దాడు.. ఏ పాత్రలో ఏలాంటి షేడ్స్ ఉంటాయి.. ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీ పడి ఎలా నటించారు.. ఎవరి మీద ఎవరి డామినేషన్ సాగింది.. సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ హైలైట్ అవుతుంది అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

జూన్ 3న ‘విక్రమ్’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. విడుదలకు నెల రోజుల ముందే డిజిటల్ డీల్ పూర్తి చేసుకుందీ చిత్రం. హాట్ స్టార్ సంస్థ వివిధ భాషల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అలాగే ‘విక్రమ్’ శాటిలైట్ హక్కులను కూడా స్టార్ గ్రూపే సొంతం చేసుకుంది. వివిధ భాషల స్టార్ ఛానెళ్లలో ఈ చిత్రం ప్రసారం అవుతుంది. తెలుగులో స్టార్ మాలో ‘విక్రమ్’ను చూడబోతున్నాం.

డిజిటల్, శాటిలైట్ హక్కులకు కలిపి ‘విక్రమ్’ నిర్మాతలకు రూ.125 కోట్లు దక్కినట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులు కాకుండానే ఇంత పెద్ద డీల్ అంటే ‘విక్రమ్’కున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్ర థియేట్రికల్ బిజినెస్ కూడా కొన్ని నెలల ముందే పూర్తయింది. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్‌ల కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినపుడే ఈ సినిమా క్రేజ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ నెల 15న ‘విక్రమ్’ థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంచ్ కాబోతున్నాయి. ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు ఉంటే ‘విక్రమ్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపడం ఖాయం.

This post was last modified on May 5, 2022 1:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

7 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

8 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

9 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

10 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

11 hours ago