‘కేజీఎఫ్-2’ సినిమా చూసి మెజారిటీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లే కనిపించింది సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే. సమీక్షకులంతా కూడా యావరేజ్ రేటింగ్సే ఇచ్చారు ఈ చిత్రానికి. ‘చాప్టర్-1’తో పోలిస్తే కథాకథనాలు సహా చాలా విషయాల్లో ‘చాప్టర్-2’ తక్కువగానే కనిపించింది. ఐతేనేం.. కానీ ఇవేవీ ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్ సంచలనాలకు అడ్డం కాలేకపోయాయి.
తొలి రోజు నుంచి ఈ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. అందరి అంచనాలను మించిపోయి.. వరుసగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ‘కేజీఎఫ్-2’ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్లో మెగా బ్లాక్‌బస్టర్ల రికార్డులేవీ దీని ముందు నిలవలేకపోయాయి. అనేక భారీ చిత్రాల వసూళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వెళ్లిపోయిన ‘కేజీఎఫ్-2’ ఇప్పుడు ఇంకో గొప్ప మైలురాయిని దాటేసింది.
ఆమిర్ ఖాన్ ఆల్ టైం బ్లాక్‌బస్టర్ ‘దంగల్’ వసూళ్ల రికార్డును ‘కేజీఎఫ్-2’ అధిగమించడం విశేషం. హిందీ మార్కెట్లో హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో మన రాజమౌళి సినిమా ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూ.511.3 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. మొన్నటిదాకా ‘దంగల్’ రూ.387.4 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఐతే ఇప్పుడు ఆమిర్ సినిమాను మూడో స్థానానికి నెడుతూ యశ్ మూవీ రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం థియేట్రికల్ రన్ అయ్యేసరికి ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.391.65 కోట్లకు చేరుకున్నాయి. ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును అందుకోవడం కూడా లాంఛనమే. సమీప భవిష్యత్తులో ఏ హిందీ చిత్రం కూడా దీని దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఓవరాల్‌గా ‘కేజీఎఫ్-2’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటేయడం తెలిసిందే. బాహుబలి-2, దంగల్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.1100 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనమే.
This post was last modified on May 5, 2022 1:25 pm
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…