మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం మళ్లీ చిరుతో కలిసి వర్క్ చేస్తున్నాడు ప్రభుదేవా. చిరు అంటే గ్రేసీ స్టెప్స్ కి పెట్టింది పేరు. ఇక అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేసి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడంలో ప్రభుదేవా దిట్ట. అందుకే వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ విజువల్ ట్రీట్ గా నిలిచాయి. ఇటీవలే ప్రభుదేవా మెగాస్టార్ కి సాంగ్ కంపోజ్ చేస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకున్నారు. ఇంతలోనే ఇప్పుడు ప్రభుదేవా కి సంబంధించి మరో సాంగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
మొన్న మెగా ఎనౌన్స్ మెంట్ అయితే ఈసారి మంచు ఎనౌన్స్ మెంట్. జి.నాగేశ్వరరావు కథతో, కోనా వెంకట్ స్క్రీన్ ప్లే తో ఇషాన్ సూర్య అనే దర్శకుడిని పరిచయం చేస్తూ మంచు విష్ణు ఓ కామెడీ డ్రామా సినిమా చేస్తున్నాడు. దీనికి నిర్మాత విష్ణునే. ఈ ప్రాజెక్ట్ కోసం లెక్కకు మించి ఖర్చుపెడుతున్నారు. ఇందులో ఓ సాంగ్ కొరియోగ్రఫీ కోసం ప్రభుదేవాని తీసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో మంచు విష్ణు, పాయల్ మీద ఆ సాంగ్ తీస్తున్నారు.
నిజానికి ప్రభుదేవా ఈ మధ్య డాన్స్ మాస్టర్ గా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడిగా బిజీ అయ్యాక డాన్స్ కి గ్యాప్ ఇచ్చాడు. తాజాగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్న సినిమా విష్ణుదే.
This post was last modified on May 5, 2022 11:10 am
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…