నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. తెలుగు వారి పండుగలు ఏవి వచ్చినా అందుకు తగ్గ వస్త్రధారణతో, ఆహార్యంతో కనిపించే ఆయన.. పూజలు పునస్కారాల విషయంలో ఎంత పద్ధతిగా వ్యవహరిస్తారో అందరూ చూస్తూనే ఉంటారు.
అదే సమయంలో వేరే మతాలకు సంబంధించిన పండుగలు ఏవి వచ్చినా కూడా ఆయన వాటికి అంతే ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ.. అందుకు తగ్గ ఆహార్యంతో శుభాకాంక్షలు చెబుతారు. ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగానూ బాలయ్య తన మార్కు చూపించారు. తన నివాసంలో ఎన్టీఆర్ ఫొటో ముందు నిలబడి.. ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని రంజాన్ ప్రత్యేకతను చాటి చెబుతూ.. ఆయన తనదైన శైలిలో రంజాబ్ విషెస్ చెప్పారు ముస్లిం సోదరులకు.
‘‘ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.
ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వ మానవ సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ’’ అని నందమూరి హీరో పేర్కొన్నారు.
This post was last modified on May 4, 2022 6:27 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…