ప్రతి సంవత్సరం రంజాన్ పండగంటే ఖచ్చితంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అంతగా భాయ్ మూవీకి అలవాటు పడ్డారు బాలీవుడ్ లవర్స్. ఇంకే ఇతర హీరో వచ్చినా అతని స్థాయిలో కలెక్షన్లు రావనేది చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. ఆఖరికి డిజాస్టర్లు కూడా వంద కోట్ల గ్రాస్ దాటిన దాఖలాలు ఉన్నాయి.
అందుకే సల్మాన్ ఈద్ ని మిస్ కాకుండా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడుకుని రిలీజులను ప్లాన్ చేసుకుంటాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల గత రెండేళ్లుగా అది సాధ్యపడటం లేదు. 2018లో వచ్చిన రేస్ 3 దారుణమైన కంటెంట్ తోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మరుసటి ఏడాది విడుదలైన భారత్ యావరేజ్ గా ఉన్నా ప్రేక్షకులు భారీ కలెక్షన్లు ఇచ్చారు.
ఇక రాధే డైరెక్ట్ ఓటిటి కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. ఈ గ్యాప్ ని ఇతర స్టార్లు వాడుకోలేకపోయారు. దీంతో ఇప్పుడీ 2022 రంజాన్ నార్త్ బాక్సాఫీస్ కు చప్పగా మిగిలిపోయింది. రెండు రోజుల క్రితం రిలీజైన హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించగా రన్ 34 పర్వాలేదనిపించుకున్నా ఫిగర్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ సెలవు రోజే అయినా ఉత్తరాది థియేటర్ల ఆక్యుపెన్సీ 25 శాతం లోపే ఉందట. ఉపవాసదీక్ష కారణంగా సినిమా హాళ్లకు దూరంగా ఉన్న ముస్లింలు కొత్త చిత్రాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ సల్మాన్ సినిమా ఉంటే మాత్రం రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. ఉన్నంతలో కెజిఎఫ్ 2 వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు కావడంతో మిస్ చేసుకున్నవాళ్ళు దాదాపు ఎవరూ లేరు. ఇదండీ సల్లు భాయ్ మిస్ చేసుకున్న రంజాన్ ఛాన్స్
This post was last modified on May 4, 2022 6:18 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…