దేశంలోనే అత్యుత్తమ డ్యాన్సర్లుగా చెప్పుకోదగ్గ స్టార్ హీరోలు టాలీవుడ్ సొంతం. నిన్నటి తరంలో చిరంజీవి తిరుగులేని డ్యాన్సర్ అయితే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి సూపర్ డ్యాన్సర్లు టాలీవుడ్ సొంతం. వీళ్లు కాక రామ్ లాంటి వాళ్లు కూడా మంచి డ్యాన్సర్లే. దాదాపు వీళ్లందరితోనూ పని చేసి, ఇప్పుడు టాలీవుడ్లోనే కాక సౌత్ ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కే ప్రతి పెద్ద సినిమాలోనూ శేఖర్ కంపోజ్ చేసిన పాట కచ్చితంగా ఉంటోంది. మహేష్ బాబు బేసిగ్గా అంత మంచి డ్యాన్సర్ కాదన్న పేరున్నప్పటికీ.. ‘సర్కారు వారి పాట’లో కళావతి పాటలో అతడితో అందమైన స్టెప్స్ వేయించి మార్కులు కొట్టేశాడు శేఖర్. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అతను ఈ రోజు మీడియాను కలిశాడు.
ఈ సందర్భంగా శేఖర్‌కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి మీడియా నుంచి. టాలీవుడ్లో డ్యాన్సుల పరంగా చాలా తక్కువ కష్టపడేది, ఈజీగా స్టెప్స్ వేసేది ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు శేఖర్. ఎంత పెద్ద స్టార్లయినా, డ్యాన్సర్లయినా రిహార్సల్స్ అనేది సర్వ సాధారణమని.. తారక్ మాత్రం అసలు రిహార్సల్స్ చేయకుండా నేరుగా సెట్స్‌కు వచ్చి అప్పటికప్పుడు చెప్పి స్టెప్ వేసేస్తాడని శేఖర్ ఎలివేషన్ ఇచ్చాడు. దీన్ని బట్టి తారక్ ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘ఆచార్య’ సినిమాలో చిరు-చరణ్ కలిసి చేసిన భలే బంజారా పాట అనుకున్న స్థాయిలో లేదు అన్న విమర్శ మీద శేఖర్ స్పందించాడు. ఏదైనా సరే.. పాటకు తగ్గట్లే ఉంటుందని.. పాటను అనుసరించే తాను స్టెప్స్ కంపోజ్ చేశానని శేఖర్ తెలిపాడు. నిజానికి ఈ పాట తొలిసారి విన్నపుడే అనుకున్నంత ఊపు లేదనిపించింది. వినడానికి బాగున్నా.. మరీ విరగబడి డ్యాన్సులు వేసే స్థాయిలో ఆ పాటలో ఊపు కనిపించలేదు. అయినప్పటికీ శేఖర్ ఉన్నంతలో మంచి స్టెప్పే కంపోజ్ చేశాడని చెప్పాలి.
This post was last modified on May 4, 2022 1:29 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…