ఒకపక్క మేనమామ వెంకటేష్ నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ డెబ్యూ చేయనుండగా మరోవైపు నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ తో దూత ద్వారా ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సంస్థ ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో దీని ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. మంచి ఫామ్ ఉన్న సమయంలో చైతు ఇలా స్మార్ట్ స్క్రీన్ వైపు ఆసక్తి చూపించడం మంచి పరిణామం.
కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ రూపంలోనూ తమ ఫేవరెట్ హీరోని అభిమానులు పదే పదే చూసుకునే అవకాశం దక్కుతుంది. దూతకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం, థాంక్ యు తర్వాత వరసగా మూడోసారి చైతుతో చేస్తున్నారు. దూతకు సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ లీక్స్ ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించేలా ఉన్నాయి.
దూత హారర్ జానరే అయినప్పటికీ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. విక్రమ్ అప్పట్లో మాధవన్ తో తీసిన 13B పెద్ద సెన్సేషన్. ఊహించని పాయింట్ తో టీవీ సీరియల్ పాత్రల ద్వారా భయాన్ని సృష్టించి విక్రమ్ కుమార్ చేసిన ప్రయోగం అన్ని భాషల్లోనూ సక్సెస్ అయ్యింది.
ఇప్పుడీ దూతలో కూడా ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందట. నిర్జీవంగా ఉండే వస్తువులు తప్పు చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. చట్టంలో వీటికి శిక్ష ఉండదు పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి తలెత్తుంది. చైతు కుటుంబాన్ని ఒక ప్రమాదం చుట్టుముడుతుంది. ఇంతకీ దూత ఎవరు, కంటికి కనిపించని దెయ్యాల నుంచి తన ఫ్యామిలీని చైతు ఎలా కాపాడుకున్నాడనే పాయింట్ మీద రూపొందుతోందట. లైన్ ఎలా అనిపించినా విక్రమ్ కుమార్ తనదైన స్క్రీన్ ప్లే మేజిక్ చేయడం ఖాయమంటున్నారు
This post was last modified on May 3, 2022 7:57 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…