Movie News

మెగా భయం.. కొరటాలతోనే ఇలా ఉంటే?

మెగాస్టార్ చిరంజీవికి ‘ఆచార్య’ ఒక చేదు అనుభవం లాగా మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. వీకెండ్లోనే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. తొలి రోజు భారీగానే కలెక్షన్లు రాబట్టినా.. రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఆదివారం పరిస్థితేంటో చూడాలి. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ మాత్రమైనా వసూళ్లు వస్తున్నాయి కానీ.. మామూలుగా ఈ చిత్రానికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇది కూడా కష్టమవ్వాలి.

అసలు వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు తీసిన కొరటాల శివ నుంచి ఇలాంటి సాధారణ చిత్రం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆయన తొలి నాలుగు సినిమాలు పెద్దగా వంకలు పెట్టడానికి వీల్లేనట్లుగా ఉంటాయి. ఎక్కడైనా కొంచెం తగ్గినా.. వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేసే సీన్ ఇంకోటి వచ్చేస్తుంది. హైలైట్లుగా చెప్పుకోవడానికి చాలా అంశాలు కనిపిస్తాయి వాటిలో.

అలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు చిరు-చరణ్ కాంబినేషన్లో సినిమా చేసే అరుదైన అవకాశం వచ్చినపుడు ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడం పెద్ద షాక్. ఐతే కొరటాల శివ లాంటి అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడే ఇలాంటి సినిమా తీస్తే.. చిరు జట్టు కట్టిన వేరే దర్శకులు, ఆయన చేస్తున్న సినిమాల కథాంశాల ప్రకారం చూస్తే అవి ఇంకెలా ఉంటాయో అన్న కంగారు మెగా అభిమానుల్లో కలుగుతోంది ఇప్పుడు.

ముఖ్యంగా మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్’ విషయంలో వారి భయం చాలా ఎక్కువగా ఉంది. ఇది తమిళంలో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన రొటీన్ మాస్ మసాలా మూవీ ‘వేదాళం’కు రీమేక్. అది దశాబ్దాల కిందటి సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. కథాంశం పరంగా ఎగ్జైట్ చేసే అంశాలు తక్కువే. పైగా మెహర్ దాన్ని మెరుగు పరిచి వైవిధ్యంగా తీర్చిదిద్దుతాడన్న ఆశలేమీ లేవు. సినిమా పాత వాసనలు కొట్టి, రొటీన్ ఎలివేషన్లు ఉంటే ఎలా ఉంటుందో చాలా సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అందులోనూ ‘ఆచార్య’ చూశాక ఈ భయాలు ఇంకా పెరుగుతున్నాయి.

చిరు జట్టు కడుతున్న మరో దర్శకుడు బాబీ ట్రాక్ రికార్డు కూడా అంతంతమాత్రం. తొలి చిత్రం ‘పవర్’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది తప్ప.. మిగతా చిత్రాలు మరీ రొటీన్. మరి చిరుతో అతనెలాంటి సినిమా తీస్తాడో అన్న భయాలు పెరుగుతున్నాయి. ఇక ‘గాడ్ ఫాదర్’ కూడా రీమేక్ కావడంతో ఎగ్జైట్మెంట్ తక్కువగానే ఉంది. కాకపోతే దర్శకుడు మోహన్ రాజా మీద కొంత మేర ఆశలున్నాయి. కానీ ఈ మూడు సినిమాల్లో ఏది కూడా అద్భుతాలు చేసేస్తుందన్న ఆశలైతే లేవు. ఐతే అద్భుతాలు చేయకున్నా ‘ఆచార్య’ ఫలితాన్ని రిపీట్ చేయకపోతే చాలన్నదే అభిమానుల కోరిక.

This post was last modified on May 1, 2022 5:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

36 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago