ఈ మధ్య పెద్ద సినిమాల నుంచి పాటల తాలూకు లిరికల్ వీడియోలు.. ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోవడం సర్వ సాధారణం అయిపోయింది. ఒక లీక్ జరిగినపుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దోషులను ఊరికే వదిలిపెట్టం అన్నట్లుగా మాట్లాడే ఆయా చిత్ర బృందాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం.. తర్వాత ఇలాంటి పరిణామాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’కు సంబంధించి లీక్స్ మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. చిత్ర బృందమే కావాలని చేస్తోందా అని సందేహాలు కలిగించే స్థాయిలో మళ్లీ మళ్లీ లీక్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన తొలి పాట ‘కళావతి’ ఒక రోజు ముందే ఆన్ లైన్లోకి వచ్చేయడం కలకలం రేపింది.
ఎంతో ఖర్చు పెట్టి, ప్రత్యేకంగా సెట్ వేసి, మ్యూజికల్ టీంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లిరికల్ వీడియో ఇలా లీక్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ విషయమై సంగీత దర్శకుడు తమన్ అప్పుడు ఎంత ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశాడో గుర్తుండే ఉంటుంది. నమ్మి ఒకడిని పని అప్పగిస్తే ఇలా చేశాడంటూ తీవ్ర ఆవేదన స్వరంగా అతను వాయిస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు.
అతడి కోపం చూస్తే తప్పు చేసిన వ్యక్తిని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించలేదు. ఐతే కెరీర్ పాడవుతుందన్న ఉద్దేశంతో ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు తమన్ వెల్లడించాడు. తప్పు చేసిన వ్యక్తి ఎవరో వెంటనే గుర్తించామని.. ఐతే నిర్మాతలు చాలా మంచి వాళ్లు కావడంతో ఆ వ్యక్తి కెరీర్ పాడవకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లు తమన్ వెల్లడించాడు.
ఇక లిరికల్ వీడియోలకు ప్రత్యేకంగా సెట్స్ వేసి, అంత మంది ఆర్టిస్టులను తీసుకుని, అంత ఖర్చు పెట్టడం అవసరమా అని తమన్‌ను అడిగితే.. డిమాండ్ ఉంది కాబట్టి, జనాలు ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టే అలా చేస్తున్నామని.. మరి ఊరికే వచ్చేస్తాయా 150 మిలియన్ వ్యూస్, ఆర్థికంగా ఇది లాభదాయకం అనిపిస్తేనే చేస్తామని తమన్ వెల్లడించాడు.
This post was last modified on May 1, 2022 5:36 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…