Movie News

అజయ్ దేవగణ్-సుదీప్ గొడవపై కంగనా రియాక్షన్

దేశంలో ‘హిందీ’ గొడవ రోజు రోజుకూ పెద్దదే అవుతోంది. భారతీయ ప్రజలందరూ ఉమ్మడి భాషగా ఇంగ్లిష్‌ను కాకుండా హిందీని ఉపయోగించాలని కొన్ని రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం పట్ల దక్షిణాది జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇంతలో కన్నడ సినీ నటుడు సుదీప్.. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది చిత్రాల ఆధిపత్యం గురించి మాట్లాడాడు.

హిందీ ఇంకెంతమాత్రం జాతీయ భాష కాదని వ్యాఖ్యానించడంతో.. దీనికి బదులుగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీలో ట్వీట్ వేసి హిందీ ప్రాధాన్యం గురించి సుదీప్‌కు చాటిచెప్పే ప్రయత్నం చేయడం.. ఈ క్రమంలో హిందీలో మీ సినిమాలను ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. అజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపాయి. దీని మీద రాజకీయ నాయకులు కూడా స్పందించారు.

జాతీయ టీవీ ఛానెళ్లలో డిబేట్లు కూడా నడిచాయి. తమిళ నటి కస్తూరి లాంటి వాళ్లు సౌత్ మీద హిందీ ఇంపోజిషన్ గురించి తీవ్ర స్థాయిలోనే దుయ్యబట్టారు. కట్ చేస్తే ఇప్పుడీ వివాదంలోకి కంగనా రనౌత్ కూడా చేరింది. తన కొత్త చిత్రం ‘దాకడ్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒక విలేకరి సుదీప్-అజయ్ మాటల యుద్ధం గురించి ప్రస్తావించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. వివాదాలకు మారుపేరైన కంగనాను ఇలాంటి ఇష్యూ మీద అడిగితే.. ఏదో ఒక బోల్డ్ కామెంట్ చేస్తుందని అనుకుంటాం.

కానీ ఆమె కొంచెం ఆచితూచే స్పందించింది. హిందీని జాతీయ భాషగా రాజ్యాంగం గుర్తించిన మాట వాస్తవమని.. కేంద్ర ప్రభుత్వం నడిచేది ఢిల్లీలో కాబట్టి హిందీని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించినట్లే అని.. అజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆమె వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఆమె కన్నడ, తమిళం లాంటి దక్షిణాది భాషల గొప్పదనం గురించి మాట్లాడింది.

ఇవి హిందీ కంటే ప్రాచీనమైనవని విన్నానని.. అలాంటపుడు తమ భాషకు గౌరవం దక్కాలని దక్షిణాది వాళ్లు కోరుకోవడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడింది. తన దృష్టిలో జాతీయ భాషగా హిందీని కాకుండా సంస్కృతాన్ని పెట్టాల్సిందని.. హిందీ, తమిళం, కన్నడ సహా చాలా భారతీయ భాషలు సంస్కృతం నుంచే వచ్చాయి కాబట్టి, అన్నిటికంటేఅదే ప్రాచీన భాష కాబట్టి దాన్నే జాతీయ భాషగా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.

This post was last modified on April 30, 2022 11:05 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

4 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

6 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

6 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

6 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

10 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

10 hours ago