మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు లేక కాదు. రాజకీయాల కోసం బ్రేక్ తీసుకోవడానికి ముందు చివరగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫ్లాపే అయింది. అంతకుముందు ‘మృగరాజు’ ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇవి కాకుండా అంతకుముందు చిరు కెరీర్లో నిరాశ పరిచిన చిత్రాలున్నాయి. కానీ ఆ సినిమాలన్నింట్లో కూడా చిరు మాత్రం నిరాశ పరచలేదు. తన వరకు ఆయన పూర్తి స్థాయిలో అభిమానులను ఎంగేజ్ చేసేవారు.
డ్యాన్సులు, ఫైట్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వీటికి మించి ఉత్సాహభరితమైన నటనతో చిరు ఆకట్టుకునేవారు. కామెడీ కుమ్మేసేవారు. ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీసేవారు. కానీ ‘ఆచార్య’ సినిమాలో ఇవన్నీ మిస్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా ఎలా ఉన్నా సరే.. చిరు సూపర్ అని ఈ సినిమా విషయంలో చెప్పలేని పరిస్థితి. బహుశా చిరు కెరీర్లో ఇలాంటి ఫీలింగ్ కలిగించిన సినిమా ఇదొక్కటేనేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.
చిరు ‘ఆచార్య’లో కనిపించినంత డల్లుగా కెరీర్లో మరే చిత్రంలోనూ కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇందుక్కారణం ఆయన వయసు అని చెప్పలేం. ఎందుకంటే లుక్ పరంగా చిరు సూపర్ అనిపించాడు. అలాగే డ్యాన్సుల్లోనూ తన గ్రేస్ చూపించాడు. ఫైట్లు కూడా ఓకే. కానీ నటన మాటెత్తితే మాత్రం చిరులో అసలు ఉత్సాహమే కనిపించలేదు. ఇక్కడ చిరు తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి కొరటాలకు సరెండర్ అయిపోయాడనిపిస్తుంది. కొరటాల హీరోలు మామూలుగా చాలా కూల్‌గా, కామ్‌గా కనిపిస్తారు. ఎక్కువ యాక్ట్ చేయరు. రియాక్షన్ పెద్దగా కనిపించదు. ఎంతో ఆవేశంతో చెప్పాల్సిన డైలాగ్‌ను కూడా కూల్‌గానే చెబుతారు.
వేరే సినిమాల్లో చాలా హైపర్‌గా కనిపించే తారక్ సైతం ‘జనతా గ్యారేజ్’లో ఎంత సటిల్ యాక్టింగ్ చేశాడో తెలిసిందే. బహుశా కొరటాల శైలిలో తాను ఇమిడిపోవాలనో ఏమో చిరు.. పాత్ర, నటన విషయంలో అండర్ ప్లే చేసినట్లు అనిపించింది. ఐతే క్యారెక్టర్ని బాగా తీర్చిదిద్ది ఉంటే.. దానిలో లోతు ఉండుంటే.. అలాగే కథా బలం తోడై ఉంటే.. చిరు ఇలా కనిపించడం పెద్ద సమస్య అవ్వకపోయేది. చిరుకు ‘ఆచార్య’ ఒక భిన్నమైన సినిమా అయ్యుండేది. కానీ అవన్నీ మిస్ అయిపోవడంతో చిరు పాత్ర, నటన ప్రేక్షకులకు రుచించట్లేదు. చిరు పాత్రలో ఇంత నీరసమేంటి అన్న ఫీలింగ్ కలిగింది.
This post was last modified on April 30, 2022 9:03 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…