Movie News

కాజల్ ఫ్యాన్స్‌కి ఆ ముచ్చటా లేకపాయె..

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రతి కథానాయికకూ ఉంటుంది. కాజల్ అగర్వాల్ ‘ఖైదీ నంబర్ 150’తో ఆ కోరిక తీర్చుకుంది. ఆల్రెడీ చరణ్‌కు కథానాయికగా నటించినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా చిరు పక్కన హీరోయిన్‌గా తీసుకున్నారామెను. తర్వాత ‘ఆచార్య’ కోసం కథానాయిక వేట కూడా కాజల్ దగ్గరే ఆగింది. చిరుతో మరోసారి జోడీ కట్టే అవకాశం దక్కించుకుందామె. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.

కొన్ని రోజులు చిత్రీకరణ జరిపాక కాజల్ పాత్ర సరిగా రాలేదని భావించి ఆమెను పక్కన పెట్టేశారు. ఈ విషయం కూడా చాలా ఆలస్యంగా రివీలైంది. ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎవ్వరూ కాజల్ పేరెత్తకపోవడం సందేహాలు రేకెత్తిస్తే.. తర్వాత ఓ ఇంటర్వ్యూలో కొరటాల అసలు విషయం వెల్లడించాడు. ఆమె పాత్రను తీసేశామన్నాడు. ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘లాహె లాహె’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో కాజల్ కనిపించడం గుర్తుండే ఉంటుంది.

ఇదే విషయంలో ఇంటర్వ్యూలో అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు కొరటాల. సినిమాలో చూడండి అనేశాడు. కాజల్‌తో కొన్ని రోజులు పని చేయించుకుని, ఆమెకు కొంత పారితోషకం కూడా ఇచ్చారు కాబట్టి కనీసం పాటలో క్యామియో లాగా ఆమెను ఉపయోగించుకుంటారని, ఆ పాట వరకు ఆమె తళుక్కుమంటుందని ఆమె అభిమానులు భావించారు. ఇదే ఉద్దేశంతో సినిమాకు వెళ్తే వారికి పెద్ద షాక్ తగిలింది. లాహే లాహే పాట మొదలైంది.. ముందుకు సాగింది.. ముగిసిపోయింది. కానీ కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

ఆమె దృశ్యాలను అక్కడ కూడా లేపేశారన్నమాట. దీంతో ఈ సంగతేతో ముందే చెప్పేస్తే బాగుండేది కదా, మళ్లీ ఊరించి ఉస్సూరుమనిపించడం దేనికి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాజల్ అభిమానుల నుంచి. ఇక కాజల్ పాత్రను తీసేయడం వల్ల సినిమాకేమైనా అదనపు ప్రయోజనం దక్కిందా అన్న చర్చ కూడా నడుస్తోందిప్పుడు. ఓపక్క రెజీనాతో చిరు ఐటెం సాంగ్‌లో చిందులు వేయడానికి లేని ఇబ్బంది.. ఆ పాత్రకు కథానాయికను పెడితే ఏమొచ్చింది అని కాజల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారిప్పుడు.

This post was last modified on April 30, 2022 8:50 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago