గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేసింది. ఈ నెలలో ‘కేజీఎఫ్-2’ హవా నడిచింది. రెండు వారాల పాటు ఆ సినిమా హంగామా సాగాక.. ఈ వారం వివిధ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఒక వీకెండ్లో ఇన్ని పెద్ద సినిమాలు రిలీజైన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. ఐతే ఈ సినిమాలన్నీ అంచనాలకు తగ్గట్లు ఉంటే బాక్సాఫీస్ హంగామా మరో స్థాయిలో ఉండేది.
కానీ ఈ వారం సినిమాల్లో చాలా వరకు ప్రేక్షకుల అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయింది. ఆల్రెడీ గురువారం తమిళ, తెలుగు భాషల్లో ‘కేఆర్‌కే’ అనే సినిమా రిలీజైంది. విజయ్ సేతుపతి, నయనతార, సమంతల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్ చూస్తే క్రేజీ ఫన్ రైడ్ లాగా కనిపించిన ‘కేఆర్కే’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ చిత్రం తొలి రోజే వాషౌట్ అయిపోయింది. సరైన ప్రమోషన్లు లేకపోవడం, దీనికి తోడు నెగెటివ్ టాక్ రావడంతో తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. ఇక శుక్రవారం రిలీజవుతున్న ‘ఆచార్య’ మీద మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరు దాదాపు మూడేళ్లు కష్టపడి చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు.
ఎక్కువగా డివైడ్ టాకే వస్తోంది. మెగా అభిమానులే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ టాక్‌ను తట్టుకుని సినిమా ఏ మేర నిలబడుతుందో చూడాలి. ఇక ఈ వారం మలయాళంలో ‘జనగణమన’ అనే సినిమా మంచి అంచనాలతో రిలీజైంది. పృథ్వీరాజ్-సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌తో అమితంగా ఆకట్టుకుంది. కానీ సినిమాలో అంతగా విషయం లేదని క్రిటిక్స్ తేల్చేస్తున్నారు. పబ్లిక్ టాక్ కూడా బాగా లేదు. ఇక హిందీ విషయానికి వస్తే.. ఒకే వీకెండ్లో రెండు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి.. టైగర్ ష్రాఫ్ నటించిన మాస్ మూవీ ‘హీరో పంటి-2’. ఐతే కేవలం యాక్షన్ సన్నివేశాలు తప్పితే సినిమాలో ఏ విశేషం లేదని.. సినిమా పరమ బోరింగ్ అని అంటున్నారు.
ఐతే మరో చిత్రం ‘రన్ వే 34’కు మాత్రం మంచి టాకే వినిపిస్తోంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన థ్రిల్లర్ ఇది. విమానంలో సమస్య తలెత్తి కూలిపోయే ప్రమాదంలో పడ్డ స్థితిలో ఒక పైలట్ చేసిన సాహసం నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందట. ఇటు రివ్యూలు, అటు పబ్లిక్ టాక్ బాగున్నాయి. ఐతే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి బజ్ లేదు. మరి పాజిటివ్ టాక్‌ను ఉపయోగించుకుని ఈ వీకెండ్ బాక్సాఫీస్ విన్నర్‌గా ‘రన్ వే 34’ నిలుస్తుందేమో చూడాలి.
This post was last modified on April 29, 2022 7:26 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…