Movie News

చైతూ డెబ్యూ సిరీస్..

బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లలో చాలామంది డిజిటల్ డెబ్యూ చేసేశారు. అక్కడ వెబ్ సిరీస్‌ల సంస్కృతి కొన్నేళ్ల ముందే మొదలైంది. గత రెండు మూడేళ్లలో అది బాగా ఊపందుకుంది. కానీ సౌత్ ఇండియాలో ఇంకా చిన్న స్థాయిలోనే వెబ్ సిరీస్‌లు తెరకెక్కతున్నాయి. పెద్ద స్టార్లు, ముఖ్యంగా హీరోలు వాటి వైపు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టిసారించట్లేదు. టాలీవుడ్ నుంచి ముందుగా అటు వైపు అడుగు పెడుతున్నది అక్కినేని నాగచైతన్యనే.

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు కానీ.. అంతకంటే ముందు చైతూ సిరీసే ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మనం’, ‘థ్యాంక్ యు’ చిత్రాలు చేసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతను కొన్ని నెలల కిందట ‘దూత’ పేరుతో ఓ సిరీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సిరీస్ డిజిటల్ డీల్ బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్‌ ఈ సిరీస్‌ను ప్రసారం చేయబోతోంది. గురువారం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘దూత’ తమ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కానున్నట్లు అమేజాన్ ప్రైమ్ వెల్లడించింది.

దీంతో పాటుగా ఆ సంస్థ పలు కొత్త సినిమాలు, సిరీస్‌లను అనౌన్స్ చేసింది. తెలుగు నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అంటే ‘దూత’ అనే చెప్పాలి. చైతూ-విక్రమ్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. దాని తర్వాత ఇద్దరూ ‘థ్యాంక్ యు’ కోసం జట్టు కట్టారు.

ఈ సినిమాను ఇలా పూర్తి చేశారో లేదో అలా ‘దూత’ సిరీస్‌ను మొదలుపెట్టారు. బేసిగ్గా తనకు హార్రర్ జానర్ నచ్చదని, తొలిసారి ఆ జానర్లో నటిస్తున్నానని ఈ సిరీస్ ఆరంభమైన సందర్భంగా చైతూ వెల్లడించాడు. ఇందులో అతను జర్నలిస్టు పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మరి హార్రర్ కథలో జర్నలిస్ట్ పాత్ర ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. వేసవిలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

This post was last modified on April 29, 2022 9:52 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago