మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రామ్ చరణ్ ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని తరచుగా మెగా అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల రీమేక్‌ల్లో చరణ్ నటిస్తే బాగుంటుందని వాళ్లు అభిప్రాయపడుతుంటారు. ఐతే ఇప్పటికి చరణ్ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. చరణే కాదు.. మెగా ఫ్యామిలీలో మిగతా హీరోలు కూడా చిరు రీమేక్‌ల జోలికి పోలేదు.
ఐతే ఆచార్య ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరు.. అల్లు అర్జున్ తన సినిమాల్లో ఏది రీమేక్ చేస్తే బాగుంటుందో చెప్పడం విశేషం. తన కెరీర్లో చాలా వైవిధ్యమైన చిత్రాల్లో ఒకటైన చంటబ్బాయ్‌ని బన్నీ రీమేక్ చేస్తే బాగుంటుందని చిరు చెప్పాడు. బన్నీలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుందని.. కాబట్టి అతను చంటబ్బాయ్ రీమేక్‌లో నటిస్తే బాగా సూటవుతుందని చిరు అభిప్రాయపడ్డాడు.
మెగా హీరోల్లో చిరు తర్వాత కామెడీ టైమింగ్ విషయానికొస్తే బన్నీనే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తాడు. అల్లరి పాత్రలు చేయడంలో తన స్టయిలే వేరు. రేసుగుర్రం, జులాయి సహా కొన్ని చిత్రాల్లో అల్లరి పాత్రలు భలేగా చేశాడు. ఈ నేపథ్యంలోనే బన్నీకి చంటబ్బాయ్ బాగా సూటవుతుందని చిరు అభిప్రాయపడి ఉండొచ్చు. జంధ్యాల దర్శకత్వంలో చిరు నటించిన చంటబ్బాయ్ అప్పట్లో సూపర్ హిట్టయింది.
చిరంజీవి మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్న టైంలో.. ఆయనకిది వైవిధ్యమైన చిత్రంగా నిలిచింది. ఇందులో చిరు కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయన కెరీర్లో ఇది చాలా స్పెషల్ ఫిలిం. ఈ చిత్రంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఒక టిపికల్ రోల్ చేశారు. అది భలేగా పేలింది. మరి చిరు అన్నట్లు బన్నీ చంటబ్బాయ్ రీమేక్‌లో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on April 28, 2022 9:31 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…