తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు అనీల్ రావిపూడి. నాలుగో సినిమా F2 తో బ్లాక్ బస్టర్ అందుకొని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరు తీసి డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడి తీస్తున్న F3 గురించి ఇండస్ట్రీలో పెద్దగా బజ్ లేకపోగా నెగిటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ మళ్ళీ అదే కామెడీ కంటెంట్ రిపీట్ చేసి ఈ సీక్వెల్ తీస్తున్నారా ? అనేది ఆడియన్స్ కామెంట్.
తాజాగా రిలీజైన టీజర్ , సాంగ్స్ చూస్తే అనిల్ రావిపూడి తన మేజిక్ తో మళ్ళీ అదే సినిమా తీస్తున్నారా ? అనిపిస్తుంది. F2 కి F3 పెద్దగా తేడా ఉండదేమో అనే సందేహాలు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. పైగా F2 లో అనసూయతో ఐటెం సాంగ్ పెట్టినట్టే ఇప్పుడు ఇందులో కూడా ఓ ఐటెం సాంగ్ పెట్టి పూజతో హాట్ స్టెప్స్ వేయించారు. వెంకీ రే చీకటి – వరుణ్ నత్తి ఎలిమెంట్స్ తప్ప మిగతాది అంతా రొటీన్ గానే ఉండబోతుందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
నిజానికి ఒక సెక్టార్ ఆడియన్స్ కి F2 సెకండాఫ్ నచ్చలేదు. ఇప్పటికీ కొందరు ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయ్యిందో అంటూ పెదవి విరుస్తుంటారు.
అయితే అనీల్ టాలెంట్ ని తక్కువ అంచనా వేయలేము. తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ తో ఏదో మేజిక్ చేసి ఫైనల్ గా మెప్పిస్తాడు. ఒకరకంగా కామెడీతో మెప్పించడం కూడా గొప్పే.
జబర్దస్త్ కామెడీ ని డామినేట్ చేసి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి నవ్వించడం అంటే మాములు విషయం కాదు అందుకే అనిల్ ని ఒకప్పటి జంధ్యాల . ఇవీవీ లతో పోలుస్తారు. ఇక F2 కంటే F3 లో మరింత హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేశానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు అనిల్. మరి ఈ సీక్వెల్ తో మరో బ్లాక్ బస్టర్ కొడితే అనిల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది.
This post was last modified on April 27, 2022 8:22 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…