కొన్ని రోజులుగా మెగా స్టార్ చిరు – రాజమౌళి కాంబో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆచార్య’ ఈవెంట్ లో వీరిద్దరి సినిమా ఎనౌన్స్ మెంట్ అంటూ ఓ రూమర్ కూడా ముందు రోజు హల్చల్ చేసింది. చిరుతో రాజమౌళి ఈ మధ్య చాలా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఈ కాంబోలో మూవీ అంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది.
తాజాగా ఈ కాంబో మూవీ న్యూస్ పై రెస్పాండ్ అయ్యారు చిరు. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్. అందులో భాగంగా “రాజమౌళితో మీరు సినిమా చేస్తున్నారని ఓ వార్త ఉంది నిజమేనా ?” అనే ప్రశ్నకి ఇంటర్వ్యూ లో సమాధానం ఇచ్చారు చిరు.
“రాజమౌళితో సినిమా అనేది రూమర్ మాత్రమే. ఒక వేళ రాజమౌళి నాతో సినిమా చేస్తానని అడిగినా వద్దని సుముకంగా చెప్పేస్తాను. రాజమౌళి సినిమాలో హీరో అంటే అతిగా కష్టపడాలి. అతను ఎంచుకునే కథలు, పాత్రలు అలా ఉంటాయి. ఒక నటుడిగా అతన్ని నేను సంతృప్తి పరచలేను.” ఇదీ జక్కన్నతో సినిమాపై చిరు కామెంట్.
అదే ఇంటర్వ్యూలో డైరెక్షన్ చేయడమనేది తన కోరికని తప్పకుండా ఓ సినిమా డైరెక్ట్ చేస్తానంటూ చెప్పుకున్నారు చిరు. కానీ అదెప్పుడో చెప్పలేనని ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్ మీదే ఉందని అన్నారు. ఇక తన వంతు సాయంగా హైదరాబాద్ లో ఓ పది పడకలతో ఓ మినీ హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్.
This post was last modified on April 27, 2022 12:56 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…