టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ కొన్నేళ్ల కిందట రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి.. ఇలా వరుస విజయాలతో మంచి ఊపు మీదుండగా.. ‘రాధ’ అనే సినిమా చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మాంచి స్పీడుమీదున్న అతడి కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్‌లా మారిందా చిత్రం. శర్వా తొలిసారి పోలీస్ పాత్రలో నటించిన ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు చంద్రమోహన్. తొలి సినిమాతో పరాజయం ఎదుర్కొంటే కోలుకోవడం అంత తేలిక కాదు. చంద్రమోహన్ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. తొలి సినిమా రిలీజైన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను వార్తల్లోకి వచ్చాడు. ఈసారి చంద్రమోహన్ ఒక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సిరీస్ పేరు.. ఏటీఎం. జీ5 కోసం చంద్రమోహన్ రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్.. ఏటీఎం. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్‌కు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ రెడ్డి, ఆయన కూతురు హన్సిత రెడ్డి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఫణి కందుకూరి రైటర్ కాగా.. చంద్రమోహన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి వడిత్యా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. కొత్త వాళ్లు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చి కీలక పాత్రలకు ఆర్టిస్టులను తీసుకున్నారు. ఏటీఎం అనే టైటిల్ చూస్తేనే ఇది డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ సిరీస్ అని అర్థమైపోతోంది. డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాలని హరీష్ శంకర్ ఎప్పట్నుంచో చూస్తున్నాడు. యువ దర్శకులకు అవకాశమిచ్చి ఓటీటీల కోసం ఒరిజినల్స్ చేయాలన్న ఆయన ప్రయత్నం ఎట్టకేలకు ఫలిస్తోంది. మరి ఈ సిరీస్‌తో హరీష్ అండ్ టీం ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on April 26, 2022 8:41 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…