కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందులో రామ్ చరణ్ నలబై నిమిషాల నిడివి గల సిద్ద పాత్రలో కనిపించనున్నాడనేది తెలిసిందే. ఈ పాత్రని ఎలాగైనా చరణ్ తో చేయించాలని చిరు , సురేఖ పట్టుబట్టారు. ఇక చరణ్ ‘RRR’ సెట్స్ లో ఉండటంతో కొరటాల ఈ కేరెక్టర్ కి ఆల్టర్నెట్ గా మహేష్ బాబు ని అనుకున్నారు. సిద్దగా ఆల్మోస్ట్ మహేష్ ఫిక్స్ అంటూ అప్పట్లో టాక్ బయటికొచ్చింది. కానీ చిరు తర్జనభర్జన పడి చరణ్ కోసం ప్రయత్నించారు.
చివరికి రాజమౌళిని ఒప్పించి కొన్ని కండీషన్స్ మీద చరణ్ ని ‘ఆచార్య’ సెట్స్ కి తీసుకొచ్చారు. తండ్రి కొడుకులు కలిసి నటించడంతో ఈ కేరెక్టర్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, ఇద్దరి బాండింగ్ తో సీన్స్ బాగా వచ్చాయని టీం గట్టిగా చెప్తోంది. అయితే సిద్ద పాత్రను చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఎలా ఉండేదని తాజాగా ఓ సరదా ప్రశ్న చిరుకి ప్రెస్ మీట్ లో ఎదురైంది.
చిరు దానికి బదులిస్తూ ” ఒకవేళ సిద్ధ పాత్ర చరణ్ చేసి ఉండకపోతే బెస్ట్ ఆల్టర్ నెట్ పవన్ కళ్యాణ్. నిజ జీవితంలో మా అనుబంధం సినిమాకు యాడెడ్ వేల్యూ అయ్యేది. చరణ్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే నాకు కలిగిందో… పవన్ తో చేసినప్పుడు కూడా నాకు కచ్చితంగా అదే ఫీల్ కలిగేది. కానీ అంత వరకూ రాలేదనుకోండి. ” అన్నారు.
నిజానికి చరణ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ సిద్దగా కనిపించి ఆచార్యలో స్పెషల్ రోల్ చేసి ఉంటే మాత్రం మెగా బ్రదర్స్ క్రేజ్ దెబ్బకి బాక్సాఫీస్ షేకయ్యేది. భారీ వసూళ్ళు రాబట్టి ఈ కాంబో సినిమా చరిత్ర సృష్టించి ఉండేది.
Gulte Telugu Telugu Political and Movie News Updates