‘ఆచార్య’ రిలీజ్ దగ్గరపడుతుండటంతో తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెగా స్టార్ కి ఏ చేదు ప్రశ్న ఎదురైంది. “చిరంజీవి గారి సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఏముంది ? ‘ అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా చిరంజీవి మాట్లాడుతూ “కరోన కారణంగా అన్ని పరిశ్రమలు కుంటి పడ్డాయి. అలాగే సినిమా పరిశ్రమ కూడా లాస్ అయింది. 50 కోట్ల వడ్డీ కట్టడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా ? మేము కట్టాము. ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు కనికరించి అలాంటి జీవో ఇస్తే బాగుంటుంది.” అన్నారు.
ఇక ఇన్ని కోట్ల వ్యయం పెట్టి మనకి వినోదం అందించారని ప్రేక్షకులు కూడా సరే మనం కూడా ఇద్దాం అంటూ ఓ పది రూపాయలు సాయం అందించారు. అది అడుక్కోవడం కాదు. అవసరంలో ఉన్న వారికి చేయూత. మా సినిమాకు ఓ మీడియం బడ్జెట్ సినిమా అంత వడ్డీ అయినప్పుడు.
టికెట్ రేటు పెంచడంలో తప్పేముంది ? పైగా ప్రభుత్వాలకు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మేము. అందులో నుండి కొంత అడిగి తీసుకుంటున్నాం అంతే. ఇది టికెట్ రేటు పెంచడం పై చిరు రియాక్షన్. నిజానికి ఆచార్య బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే అందరూ టికెట్ రేటు గురించి మాట్లాడుకున్నారు.
ఒకరకంగా బుకింగ్స్ స్పీడుగా ఫిల్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. టికెటు కొనాలంటే ఎవరైనా ఆలోచించే పరిస్థితి. కానీ ఇండస్ట్రీకి ఈ ఇష్యూ మీద ఓ వర్షన్ ఉంది. కరోన నేపథ్యంలో తాము ఎంతో నష్టపోయామని , అధిక వడ్డీ కట్టి సినిమా రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా టికెటు రేటు పెంపకం గురించి చిరు సీరియస్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.